IPL 2024 LSG vs GT : స్వల్ప ఛేదనలో గుజరాత్ టైటాన్స్(Gujarat Titans) కష్టాల్లో పడింది. రెండు పరుగుల వ్యవధిలో కీలక వికెట్లు కోల్పోయింది. ఇంప్యాక్ట్ ప్లేయర్గా వచ్చిన కేన్ విలియమ్సన్(1) వెనుదిరిగాడు. రవి బిష్ణోయ్ ఓవర్లో అతడికే క్యాచ్ ఇచ్చాడు. కుడివైపు ఎగిరి మరీ బిష్ణోయ్ ఆ బంతిని అందుకున్నాడు. దాంతో, 56 పరుగులకే రెండో వికెట్ పడింది.
అంతకుమందు యవ్ ఠాకూర్ బౌలింగ్లో ధాటిగా ఆడుతున్న కెప్టెన్ శుభ్మన్ గిల్(19) ఔటయ్యాడు. ఠాకూర్ వేసిన ఆరో ఓవర్ ఆఖరి బంతికి బౌల్డయ్యాడు. దాంతో, 54 పరుగుల వద్ద గుజరాత్ తొలి వికెట్ కోల్పోయింది. సాయి సుదర్శన్ 29 పరుగులతో ఆడుతున్నాడు. శరత్ క్రీజులోకి వచ్చాడు. 8 ఓవర్లకు స్కోర్.. 58/2.
B.E.A.U.T.Y 😍
Yash Thakur breaches Shubman Gill’s defence with a superb delivery👌👌#GT 54/1 in 6 overs
Watch the match LIVE on @starsportsindia and @JioCinema 💻📱#TATAIPL | #LSGvGT pic.twitter.com/qY8lwrHR4R
— IndianPremierLeague (@IPL) April 7, 2024
డబుల్ హెడర్ రెండో మ్యాచ్లో టాస్ గెలిచిన లక్నో సూపర్ జెయింట్స్ బ్యాటర్లు దంచేశారు. టాపార్డర్ మెరవకున్నా.. మిడిలార్డర్ బ్యాటర్లు ఉతికేశారు. దాంతో లక్నో నిర్ణీత ఓవర్లలో 163 రన్స్ కొట్టింది. విధ్వసంక ఆల్రౌండర్ మార్కస్ స్టోయినిస్(58) అర్ధ శతకంతో కదం తొక్కగా.. కెప్టెన్ కేఎల్ రాహుల్(33) బౌండరీలతో హోరెత్తించాడు. చివర్లో ఎప్పటిలానే నికోలస్ పూరన్(32 నాటౌట్) సుడిగాలి ఇన్నింగ్స్ ఆడాడు. దాంతో, లక్నో వికెట్ల 5 నష్టానికి 163 రన్స్ చేసింది. గుజరాత్ బౌలర్లలో ఉమేశ్, దర్శన్ నల్కందేలు రెండేసి వికెట్లు పడగొట్టారు.