IPL 2025 : లక్నో సూపర్ జెయింట్స్ సొంతమైదానంలో గుజరాత్ టైటన్స్(Gujarat Titans) ఓపెనర్లు దంచేస్తున్నారు. లక్నో బౌలర్లను ఉతికారేస్తూ శుభ్‌మన్ గిల్(53) అర్థ శతకం సాధించాడు. మరో ఓపెనర్ సాయి సుదర్శన్(51) సైతం దిగ్వేశ్ రథీ బౌలింగ్‌లో బౌండరీతో యాభైకి చేరువయ్యాడు. ఐపీఎల్లో ఈ లెఫ్ట్ హ్యాండర్‌కు ఇది 10వ ఫిప్టీ కావడం విశేషం. 11 ఓవర్లకు స్కోర్.. 109-0.
టాస్ ఓడిన గుజరాత్‌కు ఓపెనర్లు శుభ్‌మన్ గిల్(53), సాయి సుదర్శన్(51)లు శుభారంభం ఇచ్చారు. ఇద్దరూ దూకుడుగా ఆడుతూ స్కోర్‌బోర్డును ఉరికించారు. ప్రతి ఓవర్‌కు బౌంబరీ సాధించడంతో గుజరాత్ పవర్ ప్లేలో 54 రన్స్ కొట్టింది. ఆ తర్వాత కూడా ఈ జోడీ ధాటిగా ఆడి లక్నో బౌలర్లను అసహనానికి గురి చేసింది. దిగ్వేశ్ బౌలింగ్‌లో బౌండరీ సాధించడంతో గుజరాత్ స్కోర్ 100 పరుగులు దాటింది.