మునిచ్: స్వదేశంలో జరుగుతున్న ప్రతిష్టాత్మక యూరో కప్‌లో జర్మనీ శుభారంభం చేసింది. ఈ మెగా టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో జర్మనీ.. 5-1తో స్కాట్లాండ్పై భారీ విజయం సాధించింది. ఆట మొదలైన 4వ నిమిషంలోనే జర్మనీ ఆటగాడు ఫ్లోరియన్ రిట్జ్ గోల్ కొట్టగా 19వ నిమిషంలో కెప్టెన్ ఇకాయ్ గుండోగన్ రెండో గోల్ చేశాడు. కై హవెర్ట్ (45వ నిమిషంలో), నికోలస్ ఫుల్క్రగ్ (68వ నిమిషంలో) తలా ఓ గోల్ చేసి జర్మనీకి తిరుగులేని ఆధిక్యాన్నిచ్చారు. స్కాట్లాండ్ తరఫున 87వ నిమిషంలో అంటోనియో రుడిగర్ గోల్ చేసి జర్మనీ ఆధిక్యాన్ని కాస్త తగ్గించినా 93వ నిమిషయంలో ఎమ్ కెన్ మరో గోల్‌తో జర్మనీ భారీ విజయాన్ని నమోదుచేసింది. ఇదే గ్రూప్‌లో స్విట్జర్లాండ్.. 3-1తో హంగేరిని చిత్తుచేసింది. గ్రూప్-బీలో స్పెయిన్ 3-0తో క్రొయేషియాను ఓడించింది.