గోవా: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)లో హైదరాబాద్ ఫుట్‌బాల్ క్లబ్ (హెచ్ఎఫ్సీ) మరో విజయంపై కన్నేసింది. వరుస విజయాలతో ఇప్పటికే అగ్రస్థానాన్ని అధిష్టించిన హెచ్ఎఫ్సీ.. సోమవారం నార్త్ఈస్ట్ యునైటెడ్‌తో తలపడుతుంది. కండ్లు చెదిరే స్ట్రైకింగ్‌కు తోడు పటిష్ఠమైన డిఫెన్స్‌తో ప్రత్యర్థుల చుక్కలు చూపిస్తున్న హెచ్ఎఫ్సీ మరో విజయంతో సెమీస్ అవకాశాలను మరింత మెరుగు చేసుకోవాలని చూస్తున్నది. ఒడిశాతో గత మ్యాచ్‌లో వెనుకబడి పుంజుకున్న హైదరాబాద్ అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. ముఖ్యంగా స్టార్ స్ట్రైకర్ ఓగ్బాచె సూపర్ ఫామ్‌మీద ఉండటం హెచ్‌ఎఫ్‌సీకి బాగా కలిసి వస్తున్నది. దాదాపు ప్రతీ మ్యాచ్‌లో గోల్ కొడుతున్న ఓగ్బాచె.. నార్త్ఈస్ట్పై చెలరేగితే మరో గెలుపు ఖాతాలో చేరినట్లే. ఓగ్బాచెకు తోడు జావో విక్టర్, జోయల్ చియానిస్, ఆకాశ్ మిశ్రా, సివెరియో, నిఖిల్ పుజారి, అనికేత్ జాదవ్ చెలరేగి ఆడితే హెచ్‌ఎఫ్‌సీకి గెలుపు లాంఛనమే. ప్రస్తుతం 23 పాయింట్లతో హైదరాబాద్ టాప్‌లో కొనసాగుతుంటే.. నార్త్ఈస్ట్ 10 పాయింట్లతో పదో స్థానంలో ఉంది.