BWF Championships : బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌లో భారత అమ్మాయిలు అదరగొట్టారు. మహిళల డబుల్స్‌లో సంచలన ఆటతో ఏడో సీడ్‌కు గాయత్రి గోపిచంద్, త్రీసా జాలీలు షాకిచ్చారు. గురువారం జరిగిన 16వ రౌండ్లో రిన్ ఇవనగా, కీ నకనిషి(జపాన్) ద్వయాన్ని భారత జంట వరస సెట్లలో చిత్తుగా ఓడించింది. దాంతో, చరిత్రాత్మక పతకానికి మరొక విజయం దూరంలో నిలిచింది గాయత్రి, జాలీ జోడీ.
బ్యాడ్మింటన్ వరల్డ్‌కప్‌లో భారత అమ్మాయిలు జోరు చూపించారు. మహిళల డబుల్స్‌లో అంచనాలకు తగ్గట్టు రాణిస్తున్న గాయత్రి గోపిచంద్, త్రిసా జాలీలు సంచలన విజయంతో ఏడో సీడ్‌ను ఇంటికి పంపారు. బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌లో అదిరే ఆటతో రిన్ ఇవనగా, కీ నకనిశి(జపాన్) జంటకు షాకిచ్చిందీ 39వ సీడ్ అయిన భారత జంట.
Quarterfinals Bound! 🏸🔥
Treesa Jolly and Gayatri Gopichand deliver a dominant performance, taking down the 7th seeds in straight games to seal their spot in the Women’s Doubles Quarterfinals! 💪🇮🇳 pic.twitter.com/JUQukQVpWP
— BAI Media (@BAI_Media) August 20, 2026
ఆద్యంతం హొరాహోరీగా సాగిన మ్యాచ్‌లో ఫేవరెట్ జపాన్ ద్వయాన్ని అద్భుతంగా నిలువరించింది త్రిసా- గాయత్రి జోడీ. తొలి సెట్‌ను 21-16తో నెగ్గిన భారత అమ్మాయిలు.. రెండో సెట్లో మరింత రెచ్చిపోయారు. 21-12తో సెట్‌ను గెలిచిని త్రిసా గాయత్రి మరొక్క విజయం సాధిస్తే పతకం ఒడిసిపట్టడం ఖాయం.
‘ఈసారి ఎలాగైనా పతకం గెలవాలని మేము అనుకున్నాం. అయితే.. అతిగా ఆలోచించకుండా వర్తమానంలోనే ఉంటున్నాం. ఈ విజయాన్ని ఆస్వాదించి.. తదుపరి మ్యాచ్‌పై దృష్టి సారిస్తాం’ అని త్రీసా వెల్లడించింది. తర్వాతి రౌండ్లో నాలుగో సీడ్ జియా యీ ఫాన్ – ఘాంగ్ షు గ్జియాన్(చైనా)తో భారత జోడీ తలపడనుంది.