హాంగ్జౌ: ప్రతిష్ఠాత్మక బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ టూర్ ఫైనల్స్ టోర్నీలో భారత యువ జోడీ గాయత్రి గోపీచంద్, త్రిసాజాలీ బోణీ కొట్టింది. గురువారం జరిగిన మహిళల డబుల్స్ రెండో రౌండ్ పోరులో గాయత్రి, త్రిసా ద్వయం 21-19, 21-19తో చెందిన పియర్లీ టాన్, తిన్హా మురళీధరన్ జంట పై అద్భుత విజయం సాధించింది. 46 నిమిషాల్లో ముగిసిన మ్యాచ్లో గెలువడం ద్వారా గ్రూపు-ఏలో సెమీఫైనల్ అవకాశాలను కాపాడుకుంది. శుక్రవారం జపాన్ జోడీపై గెలిస్తే గాయత్రి, త్రిసాకు సెమీస్ బెర్తు ఖరారైనట్లే. ఆది నుంచే జోరు కనబరిచిన భారత ద్వయం వరుస గేముల్లో ప్రత్యర్థిని చిత్తు చేసి మ్యాచ్ను కైవసం చేసుకుంది.