Virat Kohli: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీని భారత మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ మరోసారి టార్గెట్ చేశాడు. కోహ్లీతో పాటు వరల్డ్ కప్ బ్రాడ్‌కాస్టర్‌గా ఉన్న స్టార్ స్పోర్ట్స్‌పై కూడా పరోక్షంగా విమర్శలు గుప్పించాడు. స్టార్ స్పోర్ట్స్ కోహ్లీ రికార్డులపై అధిక ప్రచారం కల్పిస్తుందని, అంత అవసరం లేదని అన్నాడు. గంభీర్ ఈ కామెంట్స్ స్టార్ స్పోర్ట్స్‌లో జరిగిన ఓ చర్చా కార్యక్రమంలోనే చేయడం గమనార్హం. భారత్ – ఇంగ్లండ్ మ్యాచ్‌కు ముందు గంభీర్ ఈ వ్యాఖ్యలు చేశాడు. అంతేగాక రోహిత్ శర్మ ఇలాంటి రికార్డుల వెంట పడలేదని, అతడు నిస్వార్థంగా దేశం కోసం ఆడుతున్నాడని కొనియాడాడు.
గంభీర్ స్పందిస్తూ.. ‘అభిమానులు, బ్రాడ్కాస్టర్ల మాదిరిగా రోహిత్ శర్మ ఈ స్టాట్స్‌ను పెద్దగా పట్టించుకోడు. కానీ అతడు ఒక నాయకుడు ఎలా ఆడాలో, ఎలా జట్టును నడిపించాలో తన ఇన్నింగ్స్ ద్వారా చెప్పకనే చెబుతున్నాడు. ఒకవేళ రోహిత్ నిజంగా గణాంకాల కోసం ఆడి ఉంటే అతడు ఇప్పటికే 40-45 సెంచరీలు చేసేవాడు. కానీ అతడు సెంచరీలు, స్టాట్స్ కోసం ఆడటం లేదు..’ అని చెప్పాడు.
Gautam Gambhir bodied some players who play for their hundred.
He said -” Rohit is leading from front , he wants to win Worldcup being attacking from start”#RohitSharma𓃵 #INDvsENG pic.twitter.com/Hh4gPgpIc1— Quantum⁴⁵ Yadav (@45_Quantum) October 29, 2023
ఆటగాళ్లు పీఆర్ లను గానీ మార్కెటింగ్ ఎక్స్‌పర్ట్స్‌ను పెట్టుకున్నంత మాత్రానా అది వాళ్లకు అంతగా సహకరించదని, జట్టులో తమ పాత్రను నిర్వర్తిస్తే చాలని గంభీర్ కామెంట్స్ చేశాడు. ఇవి కూడా కోహ్లీని ఉద్దేశించి చేసినవేనని అతడి అభిమానులు వాపోతున్నారు. కాగా, వరల్డ్ కప్ ప్రారంభం నుంచి స్టార్ స్పోర్ట్స్.. విరాట్ కోహ్లీ గణాంకాలు, అతడికి సంబంధించిన విషయాలు, ప్రతి మ్యాచ్‌కు ముందు విరాట్‌పై ప్రత్యేకమైన చర్చా కార్యక్రమాలతో నానా హంగామా చేస్తున్న విషయం తెలిసిందే.