బీజింగ్ : అమెరికా యువ సంచలనం కోకో గాఫ్ వూహాన్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్ను సొంతం చేసుకుంది. ఆదివారం వూహాన్లో జరిగిన ఉమెన్స్ సింగిల్స్ ఫైనల్లో మూడో సీడ్ గాఫ్ 6-4, 7-5తో అమెరికాకే చెందిన జెస్సికా పెగులాను ఓడించింది.
ఆమె కెరీర్లో ఇది మూడో డబ్ల్యూటీఏ 1000 టైటిల్. ఈ టోర్నీలో ఒక్క సెట్ కూడా చేజార్చుకోకుండా ఫైనల్ చేరిన ఆమె.. తుదిపోరులోనూ ప్రత్యర్థికి ఆ అవకాశమివ్వలేదు.