హైదరాబాద్, ఆట ప్రతినిధి: ఐటీఎఫ్ టోర్నీల్లో తెలంగాణ కుర్రాడు గంటా సాయి కార్తీక్ రెడ్డి జోరు కొనసాగిస్తున్నాడు. చైనీస్ తైపీ వేదికగా జరుగుతున్న వరల్డ్ టూర్ టెన్నిస్ 25కే టోర్నీలో సాయి కార్తీక్ సెమీస్కు దూసుకెళ్లాడు.
పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో సాయి కార్తీక్-హుంగ్ సుంగ్ హో జోడీ గురువారం 5-7, 7-5, 10-7తో చాంగ్ లిన్-లిన్ వీ డె (చైనీస్ తైపీ) ద్వయంపై గెలుపొందింది. తొలి సెట్లో పోరాడి ఓడిన కార్తీక్ జంట.. ఆ తర్వాత వరుసగా రెండు సెట్లలో విజృంభించింది.