Gautam Gambhir: ఆసియా కప్ ఛాంపియన్స్‌గా తొలి పొట్టి సిరీస్‌కు సిద్దమవుతోంది టీమిండియా. ఆస్ట్రేలియా పర్యటనలో వన్డే సిరీస్ చేజారడంతో.. టీ20 ట్రోఫీని అందుకోవాలనే లక్ష్యంతో ఉంది. బుధవారం మ్యాచ్‌తో సిరీస్ ఆరంభం కానుండగా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) ఫామ్ అందోళన కలిగిస్తోంది. ఆసియా కప్‌లో ఒక్క మ్యాచ్ మినహా దారుణంగా విఫలమైన మిస్టర్ 360 కంగారు నేలపై రాణిస్తాడా? చేతులెత్తేస్తాడా? అని ఫ్యాన్స్‌లో ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో కోచ్ గౌతం గంభీర్ (Gautam Gambhir) భారత సారథి ఆట గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
పొట్టి ఫార్మాట్లో సంచలనంగా పేరొందిన సూర్య.. నాయకుడిగా రాణిస్తున్నా ఆసియా కప్‌లో విఫలమయ్యాడు. ఇప్పుడు ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ అతడి బ్యాటింగ్ సత్తాకు సవాల్ విసరనుంది. తొలి మ్యాచ్‌కు ఒకటే రోజు బాకీ ఉన్నందున ఫామ్ అందుకోవాలని సూర్య భావిస్తున్నాడు. అయితే.. సూర్య ఫామ్ గురించి తానేమీ పెద్దగా ఆందోళన చెందడ లేదని గంభీర్ అంటున్నాడు.
Gautam Gambhir on Surya’s form 👇
“Failures are part of the process when you play fearless cricket.” 💬🔥
Backing his T20I skipper, Gambhir says — No concerns over Suryakumar Yadav’s batting form! 💪🇮🇳 pic.twitter.com/wIUQjyBIbi
— Mahesh (@MAHESH_EDI7S) October 27, 2025
‘నిజాయతీగా చెబుతున్నా. సూర్య ఫామ్‌లో లేనందుకు నేనేమీ కంగారు పడడం లేదు. ఎందుకంటే.. ఆల్ట్రా అగ్రెస్సివ్‌గా ఆడాలనే నియమం పెట్టుకున్నాం. ఈ సిద్దాంతానికి కట్టుబడినప్పుడు కొన్నిసార్లు వైఫల్యం ఎదురవుతుంది. సూర్యకు 30 బంతుల్లో 40 రన్స్ చేయడం గొప్ప విషయం కాదు. కానీ, ఇలా దూకుడగా ఆడే క్రమంలో ఓసారి తక్కువకే ఔటయ్యే ప్రమాదముంది. ఒకసారి అతడు రిథమ్ అందుకుంటే బౌలర్లకు నిద్రుండదు. ఓపెనర్ అభిషేక్ ఏడాది కాలంగా సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. అయితే.. వ్యక్తిగత పరుగుల కంటే దూకుడుగా.. మా బ్రాండ్ క్రికెట్ ఆడడమే మా ఉద్దేశం. అలా చెలరేగి ఆడుతూ పలుమార్లు ఔటైనా పర్వేదు. కానీ.. ఇంటెన్సిటీ మాత్రం తగ్గకూడదు’ అని గౌతీ వెల్లడించాడు. సిడ్నీలో జరిగిన మూడో వన్డేలో అజేయంగా నిలిచి జట్టును గెలిపించిన రోకోపై గంభీర్ ప్రశంసలు కురిపించాడు.
Indian head coach Gautam Gambhir lauds the RO-KO partnership in the Sydney ODI, where they put up an unbeaten 168-run stand! 🇮🇳💪🗣️#RohitSharma #ViratKohli #ODIs #India #Sportskeeda pic.twitter.com/hvw0nr7oZv
— Sportskeeda (@Sportskeeda) October 27, 2025