Ruturaj Gaikwad | న్యూఢిల్లీ: చైనా వేదికగా సెప్టెంబర్‌లో జరుగనున్న ప్రతిష్ఠాత్మక ఆసియా గేమ్స్ కోసం బీసీసీఐ..పురుషుల, మహిళల జట్లను ఎంపిక చేసింది. సీనియర్ల గైర్హాజరీలో టీమ్ఇండియా తరఫున కుర్రాళ్లు ప్రాతినిధ్యం వహించనున్నారు. ఐపీఎల్లో అదరగొట్టిన యువ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేశారు.
ఇందులో యశస్వి జైస్వాల్, రాహుల్ త్రిపాఠి, తిలక్‌వర్మ, రింకూసింగ్, జితేశ్శర్మ, సుందర్, షాబాజ్ అహ్మద్, రవి బిష్ణోయ్, అవేశ్‌ఖాన్, అర్ష్‌దీప్‌సింగ్, ముకేశ్‌కుమార్, శివమ్ మావి, శివమ్ దూబే, ప్రభ్‌సిమ్రన్ సింగ్ ఉన్నారు. స్వదేశం వేదికగా వన్డే ప్రపంచకప్ జరుగనున్న నేపథ్యంలో ఆసియా గేమ్స్‌కు యువకులను ఎంపిక చేసింది. మరోవైపు మహిళల జట్టుకు హర్మన్‌ప్రీత్‌కౌర్ కెప్టెన్‌గా, మందన వైస్‌కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నారు.