Funny Run Out | అందుకే ఫిట్నెస్ ముఖ్యమనేది.. విండీస్ మహాబలుడి ఫన్నీ రనౌట్
Funny Run Out | ఎంత నైపుణ్యం ఉన్నా ఫిట్నెస్ లేకపోతే క్రికెట్లో రాణించడం కష్టమని ఈ ఘటన మరోసారి రుజువు చేసింది. ఇన్నింగ్స్ తొలి బంతికి కార్న్వాల్ షార్ట్ ఫైన్ లెగ్ వైపు ఆడి సింగిల్ తీసేందుకు ప్రయత్నించాడు.
Funny Run Out | క్రికెట్లో నైపుణ్యం ఎంత ముఖ్యమో.. ఫిట్నెస్ కూడా అంతే ప్రధానమని రుజువయ్యే మరో సంఘటన వెలుగుచూసింది. కరీబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్)లో జరిగిన ఓ రనౌట్.. విండీస్ సింహబలుడు రాకీమ్ కార్న్వాల్ ఫిట్నెస్ లోపాన్ని ఎత్తిచూపింది. లీగ్లో భాగంగా గురువారం జరిగిన రెండో మ్యాచ్లో రాకీమ్ హాస్యాస్పద రీతిలో రనౌటై పెవిలియన్ చేరాడు. సెయింట్ లూసియా కింగ్స్, బార్బడోస్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్ ఈ ఫన్నీ ఇన్స్డెంట్కు వేదికైంది.
ఎంత నైపుణ్యం ఉన్నా ఫిట్నెస్ లేకపోతే క్రికెట్లో రాణించడం కష్టమని ఈ ఘటన మరోసారి రుజువు చేసింది. ఇన్నింగ్స్ తొలి బంతికి కార్న్వాల్ షార్ట్ ఫైన్ లెగ్ వైపు ఆడి సింగిల్ తీసేందుకు ప్రయత్నించాడు. అదే సమయంలో అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న ఫీల్డర్ మొదట తడబడ్డా ఆ తర్వాత బంతిని అందుకొని నాన్ స్ట్రయికర్ వికెట్ల వైపు విసిరాడు. అప్పటికే కైల్ మయేర్స్ పరుగు పూర్తి చేయగా.. రాకీమ్ మాత్రం క్రీజుకు చాలా దూరంలో నిలిచిపోయాడు. దీంతో తొలి బంతికి బార్బడోస్ వికెట్ కోల్పోవాల్సి వచ్చింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారగా.. అభిమానులు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే మొదట బ్యాటింగ్ చేసిన లూసియా కింగ్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. కెప్టెన్ డుప్లెసిస్ (46), సీన్ విలియమ్స్ (47), చార్లెస్ (30) రాణించారు. బార్బడోస్ బౌలర్లలో జాసెన్ హోల్డర్ 4 వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్ష్యఛేదనలో బార్బడోస్ 20 ఓవర్లలో 147 పరుగులకు ఆలౌటైంది. యాంగ్ (48) టాప్ స్కోరర్ కాగా.. మిగిలినవాళ్లంతా విఫలమయ్యారు.
Tonight’s @BetBarteronline magic moment is the run out of Rahkeem Cornwall that set the Saint Lucia Kings off on a fantastic PowerPlay! #CPL23 #SLKvBR #CricketPlayedLouder #BiggestPartyInSport #BetBarter pic.twitter.com/HgDtLWTjmK
— CPL T20 (@CPL) August 18, 2023
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

