100th Test | భారత్ – ఇంగ్లండ్ మధ్య గురవారం నుంచి మొదలుకాబోతున్న ఐదో టెస్టుతో టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, ఇంగ్లీష్ బ్యాటర్ జానీ బెయిర్ స్టోలు వందో టెస్టులు ఆడబోతున్నారు. మార్చి 8 నుంచి భారత్‌కు సుమారు 13 వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న న్యూజిలాండ్‌లో.. ఆస్ట్రేలియాతో రెండో టెస్టు ఆడబోతున్న కివీస్ జట్టులోనూ ఇద్దరు స్టార్ ప్లేయర్లు వందో టెస్టు ఆడనున్నారు. తాజా, మాజీ సారథులు టిమ్ సౌథీ, కేన్ విలియమ్సన్లకు ఇది వందో టెస్టు కానుంది. అయితే వందో టెస్టు ఎవరు ఆడినా అందులో నా పాత్ర ఉండాల్సిందే అంటున్నాడు భారత అంపైర్ నితిన్ నరేంద్ర మీనన్. ముఖ్యంగా ఆధునిక క్రికెట్లో ఫ్యాబ్ – 4 గా పిలుచుకునే విరాట్ కోహ్లీ, స్టీవ్ స్మిత్, జో రూట్, కేన్ విలియమ్సన్ ల అరుదైన ఘనతలో అతడు భాగమయ్యాడు.
న్యూజిలాండ్ – ఆస్ట్రేలియా మధ్య జరుగబోయే రెండో టెస్టుకు నితిన్ మీననే అంపైర్‌గా వ్యవహరించబోతున్నాడు. గతంలో విరాట్ కోహ్లీ, జో రూట్, స్టీవ్ స్మిత్ వందో టెస్టులకు కూడా అతడే అంపైర్‌గా ఉన్నాడు. తాజాగా ఫ్యాబ్ -4లో మిగిలినపోయిన కేన్ మామ వందో టెస్టుకూ అతడే అంపైర్‌గా ఉండనుండటం గమనార్హం.
ఫ్యాబ్ – 4 సెంచరీల టెస్టులో మీనన్..
– 2022లో విరాట్ కోహ్లీ.. మొహాలీ వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌తో వంద టెస్టులను పూర్తిచేసుకన్నాడు. ఈ మ్యాచ్‌కు నితిన్ మీనన్, వీరేంద్ర శర్మలు ఆన్‌ఫీల్డ్ అంపైర్లుగా ఉన్నారు.
– 2021లో జో రూట్ తన వందో టెస్టు ఆడాడు. చెన్నై వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో అంపైర్లుగా అనిల్ చౌదరి, నితిన్ మీనన్ వ్యవహరించారు.
– Nitin Menon was the umpire on Kohli’s 100th Test.
– Nitin Menon was the umpire on Root’s 100th Test.
– Nitin Menon was the umpire on Smith’s 100th Test.
– Nitin Menon will be the umpire on Williamson’s 100th Test.What an achievement. ⭐👌 pic.twitter.com/yvuFzH0n0v
— Johns. (@CricCrazyJohns) March 6, 2024
– 2023లో స్టీవ్ స్మిత్.. లీడ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్ ద్వారా వంద టెస్టులు పూర్తిచేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో కుమార ధర్మసేన, నితిన్ మీనన్‌లు అంపైర్లుగా ఉన్నారు.
– తాజాగా మార్చి 8 నుంచి మొదలుకాబోయే న్యూజిలాండ్ – ఆస్ట్రేలియా రెండో టెస్టులో కేన్ విలియమ్సన్ వందో టెస్టు ఆడనుండగా ఈ మ్యాచ్‌లోనూ మీనన్ అంపైర్‌గా ఉండటం విశేషం.