హైదరాబాద్, ఆట ప్రతినిధి: నెలరోజుల క్రితం ఇంటర్ కాంటినెంటల్ కప్‌తో ఫుట్‌బాల్ అభిమానులను అలరించిన నగరం మరో అంతర్జాతీయ మ్యాచ్‌కు ఆతిథ్యమివ్వబోతోంది. సోమవారం గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో భారత్, మలేషియా స్నేహపూర్వక మ్యాచ్ ఆడనున్నాయి. ఈ ఏడాది ఇప్పటిదాకా 10 మ్యాచ్‌లు ఆడిన భారత్.. ఆరింటిలో ఓడి నాలుగింటిని డ్రాతో ముగించింది.
నేటి మ్యాచ్‌లో అయినా గెలిచి ఈ సీజన్‌ను విజయంతో ముగించాలని భారత్ భావిస్తోంది. ఈ మ్యాచ్ కోసం తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ అన్ని ఏర్పాట్లను పూర్తిచేసింది. రాత్రి 7:30 గంటల నుంచి మ్యాచ్ మొదలుకానుంది. మ్యాచ్ ఆరంభానికి ముందు క్రీడాభిమానులను అలరించేందుకు మ్యూజికల్ ప్రోగ్రామ్‌ను ఏర్పాటుచేశారు.