పారిస్: ఫ్రెంచ్ ఓపెన్‌లో డిఫెండింగ్ చాంపియన్ ఇగా స్వియాటెక్ (పోలండ్) క్వార్టర్స్‌కు దూసుకెళ్లింది. ఆదివారం ముగిసిన మహిళల నాలుగో రౌండ్ మ్యాచ్‌లో స్వియాటెక్.. 6-0, 6-0తో వరుస సెట్లలో పొటపొవా (రష్యా)ను మట్టికరిపించింది. అమెరికా అమ్మాయి కోకో గాఫ్.. 6-1, 6-2తో కొకియారెట్టొ (ఇటలీ)ను ఓడించి క్వార్టర్స్‌లో జబేర్‌తో పోటీకి సిద్ధమైంది.
పురుషుల సింగిల్స్ నాలుగో రౌండ్లో మూడో సీడ్ అల్కరాజ్ 6-3, 6-3, 6-1తో అలిస్సామి (కెనడా)ను ఓడించి క్వార్టర్స్‌లో సిట్సిపస్తో పోరుకు సిద్ధమయ్యాడు. మూడో రౌండ్లో జొకోవిచ్.. 7-5, 6-7 (6/8), 2-6, 6-3, 6-0తో లొరెంజొ ముసెట్టిపై పోరాడి గెలిచాడు. పురుషుల డబుల్స్‌లో భారత ఆటగాడు రోహన్ బోపన్న-మాథ్యూ ఎబ్డెన్ (ఆస్ట్రేలియా) ద్వయం.. 7-5, 4-6, 6-4తో జొర్మన్-ఒర్లండొ (బ్రెజిల్) జోడీని ఓడించి రెండో రౌండ్‌కు దూసుకెళ్లింది.