పారిస్ : ప్రతిష్టాత్మక ఫ్రెంచ్ ఓపెన్‌లో డిఫెండింగ్ చాంపియన్ ఇగా స్వియాటెక్ క్వార్టర్స్‌కు దూసుకెళ్లింది. ఐదో సీడ్‌గా బరిలోకి దిగిన ఈ పోలండ్ అమ్మాయి.. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో 1-6, 6-3, 7-5తో ఎలీనా రిబాకినా (కజకిస్థాన్)ను ఓడించింది. ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన ఈ పోరులో స్వియాటెక్ తొలి సెట్‌ను ఓడినప్పటికీ తర్వాత అద్భుతంగా పుంజుకుని వరుస సెట్లతో పాటు మ్యాచ్‌నూ సొంతం చేసుకుంది.
క్వార్టర్స్‌లో ఆమె ఎలిన స్విటోలిన (ఉక్రెయిన్)తో తలపడనుంది. మరో పోరులో 13వ సీడ్ స్విటోలిన.. 4-6, 7-6 (8/6), 6-1తో నిరుటి రన్నరప్ జాస్మిన్ పవులోని (ఇటలీ)కి షాకిచ్చింది. ఒకటో సీడ్ సబలెంక.. 7-5, 6-3తో అమండ (యూఎస్)పై అలవోక విజయంతో క్వార్టర్స్‌కు చేరింది. క్వార్టర్స్‌లో ఆమె.. చైనా సంచలనం కిన్వెన్ జెంగ్‌తో అమీతుమీ తేల్చుకోనుంది.
పురుషుల డబుల్స్‌లో భారత ఆటగాడు రోహన్ బోపన్న/ఆడమ్ పవ్లసెక్ (చెక్) ద్వయం.. 2-6, 6-7 (5/7)తో హెన్రీ పాటెన్ (యూకే)/హ్యారీ హెలియోవర (ఫిన్లాండ్) చేతిలో ఓడిపోయి మూడోరౌండ్కే ఇంటిబా పట్టింది. మరో మ్యాచ్‌లో యూకీ బాంబ్రీ (భారత్)/రాబర్ట్ (యూఎస్) జోడీ.. 4-6, 4-6తో ఎవాన్ కింగ్/క్రిస్టియన్ హ్యారీసన్ (అమెరికా) ద్వయం చేతిలో ఓడారు.