న్యూఢిల్లీ : భారత జూనియర్ పురుషుల హాకీ జట్టు హెడ్ కోచ్‌గా ఫ్రాన్స్‌కు చెందిన ఫ్రెడరిక్ సోయెజ్ను హాకీ ఇండియా గురువారం అధికారికంగా నియమించింది. ఒలింపిక్ మెడలిస్ట్ పీఆర్ శ్రీజేష్ స్థానంలో అతను బాధ్యతలు చేపట్టనున్నాడు. గతేడాది స్వదేశంలో జరిగిన ఎఫ్ఐహెచ్ జూనియర్ ప్రపంచకప్‌లో భారత్‌కు కాంస్య పతకం అందించిన శ్రీజేష్ కాంట్రాక్ట్‌ను హెచ్ఐ రెన్యువల్ చేయలేదు.
తన హయాంలో ఆడిన ఐదు టోర్నమెంట్లలో జూనియర్ జట్టు ఐదు పతకాలు అందుకున్నప్పటికీ తన పదవీకాలాన్ని ముగించడంపై శ్రీజేష్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. కొత్త కోచ్ సోయెజ్కు అంతర్జాతీయ హాకీలో ఆటగాడిగా, కోచ్‌గా మూడు దశాబ్దాలకు పైగా అనుభవం ఉంది.