మ్యూనిక్: స్పోర్ట్స్ స్టార్స్ ఒక్కొక్కరుగా ప్రజలకు హాని కలిగించే వాటిపై పబ్లిగ్గానే తమ వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారు. ఈ మధ్యే యూరో 2020లో భాగంగా ప్రెస్ మీట్లో తన ముందున్న కోకాకోలా బాటిల్స్‌ను పోర్చుగల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో తీసి పక్కన పెట్టిన విషయం తెలుసు కదా. కోలా వద్దు, నీళ్లే ముద్దు అన్న అతని సందేశం కోకాకోలా కంపెనీకి సుమారు రూ.30 వేల కోట్ల నష్టం కూడా తెచ్చిపెట్టిందనీ వార్తలు వచ్చాయి. తాజాగా ఫ్రాన్స్ స్టార్ ప్లేయర్ పాల్ పోగ్బా కూడా రొనాల్డో రూట్లోనే వెళ్లాడు. జర్మనీతో మ్యాచ్ సందర్భంగా ప్రెస్ కాన్ఫరెన్స్‌కు వచ్చిన అతడు.. తన ముందు ఉన్న హైనెకెన్ కంపెనీకి చెందిన బీర్ బాటిల్‌ను తీసి కింద పెట్టాడు.
ఇస్లాం మతాన్ని ఆచరించే పోగ్బాకు అసలు మందు తాగే అలవాటు లేదు. ఈ విషయాన్ని అతడు చాలాసార్లు పబ్లిగ్గానే చెప్పాడు. ఈసారి ఆ బాటిల్‌ను తీసేయడం ద్వారా మందుపై తనకున్న వ్యతిరేకతను ప్రత్యక్షంగా చూపించాడు. హైనెకెన్ బేవరేజ్ కంపెనీ ప్రస్తుతం నడుస్తున్న యూరో 2020కి ఒక స్పాన్సర్‌గా వ్యవహరిస్తోంది. పోగ్బానే కాదు ఇస్లాంను ఆచరించే మొయిన్ అలీ, రషీద్ ఖాన్‌లాంటి క్రికెటర్లు కూడా మందుకు దూరంగా ఉంటారు. 2019 వరల్డ్‌కప్ గెలిచిన తర్వాత ఈ ఇద్దరూ ఇంగ్లండ్ టీమ షాంపేన్ సెలబ్రేషన్స్‌కు దూరంగా వెళ్లిపోయారు.
After #POR captain Cristiano Ronaldo and his Coca Cola removal, #FRA’s Paul Pogba makes sure there’s no Heineken on display 🍺 #EURO2020
— Sacha Pisani (@Sachk0) June 16, 2021
pic.twitter.com/U9Bf5evJcl