అబుదాబి : ఫార్ములావన్ దిగ్గజ డ్రైవర్ మాక్స్ వెర్స్టాపెన్ ఈ సీజన్లో రికార్డు స్థాయిలో 19వ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. ఆదివారం జరిగిన అబుదాబి గ్రాండ్‌ప్రి రేస్‌ను వెర్స్టాపెన్ గెలుచుకున్నాడు.
ఓవరాల్‌గా అతనికిది 54వ టైటిల్ కాగా, అత్యధిక టైటిల్స్ సాధించినవారిలో సెబాస్టియన్ వెట్టెల్ను అధిగమించి మూడో స్థానానికి చేరుకున్నాడు. లూయిస్ హామిల్టన్(103), మైకేల్ షుమాకర్(91) అతనికంటె ముందున్నారు.