Aitqa Mir : కారు రేసింగ్‌లో అదరగొడుతున్న జమ్ము కశ్మీర్ బాలిక.. యువ రేసర్ అతీకా మిర్ (Aitqa Mir) కష్టాలు తొలగిపోన్నాయి. ట్రాక్ మీద అద్బుతాలు చేస్తున్న ఆమె గురించి తెలిసిన ఫార్ములా వన్ అకాడమీ (Formula One Academy) సంస్థ ఆర్ధికంగా ఆదుకునేందుకు ముందుకొచ్చింది. ఈ విషయాన్ని శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపిందీ సంస్థ. తద్వారా సాంకేతికంగా, ఆర్ధికంగా ఫార్ములా వన్ సహకారం అందుకున్న మొదటి భారత రేసర్‌గా అతీకా గుర్తింపు సాధించనుంది.
ఇటీవలే యూఏఈలో ప్రారంభించిన ‘ఛాంపియన్స్ ఆఫ్ ది ఫ్యూచర్ అకాడమీ ప్రోగ్రామ్'(COTFA)కు ఎంపికైంది. దాంతో.. ఇక్కడ జరుగబోయే రెండు రౌండర్ల జాతీయా కార్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో పదేళ్ల అతీకాకు ఎఫ్1 అకాడమీ మద్దతుగా నిలువనుంది. ఈ సంస్థ ప్రోత్సాహంతో ఈ యంగ్ రేసర్ అంతర్జాతీయ కోఫ్తా సిరీస్‌తో పాటు.. డిస్కవర్ యువర్ డ్రైవ్ (DYD) ఈవెంట్లలో పాల్గొనే అవకాశం దక్కించుకుంది.
Atiqa Mir, just 10 years old from Srinagar Kashmir, is rewriting history.
She is one of only three girls worldwide chosen for the F1 Academy’s Discover Your Drive programme, and the youngest of them all. pic.twitter.com/zthFUdsVl3— Junaid Bhat Photographer (@Junaidbhatphoto) September 11, 2025
‘కోఫ్తాను 2023లో ప్రారంభించాం. అప్పటినుంచి మహిళా రేసర్లను ప్రోత్సహిస్తూ వస్తున్నాం. ఆరంభ సీజన్లో అమ్మాయిలు, మహిళలు 5 శాతం ఉండేవారు. ఈ ఏడాది వారి శాతం 30కి చేరింది. చెప్పాలంటే కోఫ్తాకు, ఫార్ములా వన్ అకాడమీకి ఇది అతిపెద్ద విజయం. ప్రతిభావంతులైన అమ్మాయిలను ప్రోత్సహించడంలో మా సంస్థ చేస్తున్న కృషికి నిదర్శనం’ అని ఎఫ్ 1 అకాడమీ వెల్లడించింది. చిన్నవయసులోనే రేసింగ్‌లో సత్తాచాటుతున్న అతీకా అక్టోబర్ నెల ఆరంభంలో RMC ఛాంపియన్షిప్ గెలుపొందింది. ప్రస్తుతం ఖతార్‌లో MENA నేషన్స్ కప్‌లో పోటీ పడుతోంది. భవిష్యత్‌లో మరిన్ని విజయాలతో నంబర్ వన్ మహిళా రేసర్ అవ్వాలనుకుంటోంది యంగ్‌స్టర్.