కొలంబో: లంక ప్రీమియర్ లీగ్లో మ్యాచ్లు ఫిక్సింగ్ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సేననాయకే అంతర్జాతీయ ప్రయాణాలపై స్థానిక కోర్టు సోమవారం సస్పెన్షన్ విధించింది.
2020లో జరిగిన లంక ప్రీమియర్ లీగ్లో మ్యాచ్లను ఫిక్సింగ్ చేసేందుకు ఇద్దరు ప్లేయర్లను ఫోన్ ద్వారా సంప్రదించినట్లు వెలుగులోకి వచ్చింది. కొలంబో చీఫ్ మెజిస్ట్రేట్ సేననాయకేపై మూడు నెలల పాటు నిషేధం వేస్తున్నట్లు తీర్పు ఇచ్చింది.