Kris Srikkanth | రోహిత్ నన్ను క్షమించు.. అందుకే వరల్డ్‌కప్ జట్టులోకి తీసుకోలే.!
Kris Srikkanth : 2011లోనే హిట్‌మ్యాన్‌కు వరల్డ్ కప్ విజేతగా నిలిచే అవకాశం వచ్చింది. కానీ, ఒకే ఒక కారణంతో అతడికి అవకాశం చేజారిందని మాజీ సెలెక్టర్ కృష్ణమాచారి శ్రీకాంత్ (Kris Srikkanth) అంటున్నాడు.
Kris Srikkanth : భారత కెప్టెన్‌గా రోహిత్ శర్మ(Rohit Sharma) వన్డే ప్రపంచకప్ అందని ద్రాక్షలా మిగిలింది. మూడేళ్ల క్రితం జట్టును ఫైనల్ చేర్చినా కప్ అందించలేకపోయాడు. అయితే.. 2011లోనే హిట్‌మ్యాన్‌కు వరల్డ్ కప్ విజేతగా నిలిచే అవకాశం వచ్చింది. కానీ, ఒకే ఒక కారణంతో అతడికి అవకాశం చేజారిందని మాజీ సెలెక్టర్ కృష్ణమాచారి శ్రీకాంత్ (Kris Srikkanth) అంటున్నాడు. 2011లో అతడు సూపర్ ఫామ్‌లో ఉన్నప్పటికీ వన్డే ప్రపంచకప్ స్క్వాడ్‌కు ఎంపిక చేయనందుకు తనను క్షమించాలని రోహిత్‌ను శ్రీకాంత్ అడిగాడు. తాజాగా ది వీక్ అనే పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో అప్పుడు రోహిత్‌ను పక్కన పెట్టేయడానికి గల కారణం వెల్లడించాడు.
తన కెప్టెన్సీలో భారత్‌కు టీ20 ప్రపంచకప్, ఛాంపియన్స్ ట్రోఫీ కట్టబెట్టిన రోహిత్ శర్మ వన్డే ప్రపంచకప్ మాత్రం ముద్దాడలేదు. అయితే.. మనోడికి 2011లో స్వదేశంలో జరిగిన వన్డే ప్రపంచకప్‌లో చోటు దక్కకపోవడమే అందుకు కారణం. అవును.. ఆ ఏడాది మంచి ఫామ్‌లో ఉన్న రోహిత్‌ను సెలెక్టర్లు మెగా టోర్నీకి తీసుకోలేదు. అందుకు బలమైన కారణమే ఉందంటున్నాడు అప్పటి సెలెక్టర్ కృష్ణమాచారి శ్రీకాంత్.
📣 Krish Srikkanth reveals why he dropped Rohit Sharma from 2011 world cup squad:
I feel bad for him even today. I told Rohit last year, I’m sorry, boss. It’s not by purpose, but it’s just that we want to take those half all-rounders. Our thought process was similar to that of… pic.twitter.com/mm9IpVXDdx
— TEJASH 🚩 (@LoyleRohitFan) April 22, 2026
‘రోహిత్ 2011 వన్డే ప్రపంచకప్ ఆడలేపోయాడు. రోహిత్‌ను ఎంపిక చేయనందుకు నేను చాలా బాధ పడ్డాను. ఇదే విషయం 2020లో అతడితో చెప్పి నన్ను క్షమించాలని అడిగాను. అయితే.. ఉద్దేశపూర్వకంగా రోహిత్‌ను 2011 ప్రపంచకప్‌లో పక్కన పెట్టలేదు. అప్పుడు జట్టులో ఎక్కువ మంది ఆల్‌రౌండర్లు ఉండాలనుకున్నాం. అందుకే అతడికి అవకాశం దక్కలేదు’ అని శ్రీకాంత్ వెల్లడించాడు.
ఎంఎస్ ధోనీ సారథ్యంలోని భారత జట్టు 2011లో స్వదేశంలో జరిగిన వన్డే ప్రపంచకప్‌ను కొల్లగొట్టింది. ఈ మెగా టోర్నీకి ముందు రోహిత్ 1,200 రన్స్‌తో రేసులో నిలిచాడు. కానీ, రోహిత్ పేరు లేకపోవడానికి కారణం ఆల్రౌండర్లకు ప్రాధాన్యం ఇవ్వడమేనని శ్రీకాంత్ తెలిపాడు.
‘1983 వరల్డ్ కప్ స్క్వాడ్ మాదిరిగా ఆల్‌రౌండర్లతో నిండిన స్క్వాడ్ కావాలని మేనేజ్మెంట్ నిర్ణయించింది. కాబట్టి మేము అదే వ్యూహాన్ని అనసురించాం. మా నమ్మకం నిజమైంది. ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా నిలిచిన యువరాజ్ బ్యాటుతో, బంతితో మెరిశాడు. సెహ్వాగ్, సచిన్, రైనా కొన్ని ఓవర్లు వేశారు. యూసుఫ్ పఠాన్ సైతం బౌలింగ్ చేశాడు. అందుకే.. రోహిత్‌ను పక్కన పెట్టాల్సి వచ్చింది’ అని శ్రీకాంత్ వివరించాడు. భారత్‌కు తొలి వరల్డ్‌కప్ అందించిన కపిల్ డెవిల్స్ బృందంలోని రోజర్ బిన్ని, కపిల్, శ్రీకాంత్, సయ్యద్ కీర్మాణీ, సునీల్ గవాస్కర్ సైతం బౌలింగ్ చేసిన విషయాన్ని శ్రీకాంత్ ఈ సందర్భంగా పంచుకున్నాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

