ఇస్లామాబాద్: పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది(Shahid Afridi) ఇంట్లో విషాదం చోటుచేసుకున్నది. తన సోదరి మరణించినట్లు ఆయన తన సోషల్ మీడియా అకౌంట్లో తెలిపాడు. హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ఆమె ఇవాళ ఉదయం ప్రాణాలు విడిచినట్లు అతను పేర్కొన్నాడు. సోదరి ఆరోగ్యం సరిగా లేని కారణంగా.. మాజీ క్రికెటర్ అఫ్రిది తన ప్రయాణ ప్రణాళికల్ని కూడా మార్చేశాడు. తన సోదరి అంత్యక్రియలు కూడా ఇవాళ జరగనున్నట్లు చెప్పాడు. తన సోదరి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నట్లు సోమవారం అఫ్రిది ఓ ట్వీట్ చేశాడు. షాహిద్ అఫ్రిది కుటుంబంలో మొత్తం 11 మంది ఉన్నారు. దాంట్లో ఆరుగురు సోదరులు, అయిదుగురు అక్కాచెల్లెళ్లు ఉన్నారు. షాహిద్ సోదరులు తారిక్ అఫ్రిది, అష్ఫక్ అఫ్రిది కూడా క్రికెటర్లే. ప్రస్తుత ఫాస్ట్ బౌలర్ షహీన్ షా అఫ్రిది.. షాహిద్ అఫ్రిదికి అల్లుడే.