Gautam Gambhir | బోర్డర్-గవాస్కర్ టెస్ట్ సిరీస్‌లో ఆస్ట్రేలియా చేతిలో 3-1 తేడాతో టీమిండియా ఓటమిపాలైంది. దాంతో ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ రేసు నుంచి వైదొలిగించింది. ఆస్ట్రేలియా వరుసగా రెండోసారి ఫైనల్‌కు చేరింది. జూన్‌లో ఇంగ్లాండ్ లార్డ్స్‌లో జరిగే దక్షిణాఫ్రికాతో ఆస్ట్రేలియా తలపడనున్నది. భారత జట్టు ఇప్పటి వరకు రెండుసార్లు ఫైనల్‌కు చేరింది. తొలిసారిగా టెస్టుల్లో ప్రదర్శన ఆకట్టుకోలేకపోవడంపై ఫైనల్ నుంచి నిష్క్రమించింది. ఈ క్రమంలో దాయాది పాకిస్థాన్ ఇప్పటి వరకు మూడు సైకిల్స్‌లో పాక్ తొలి మూడుస్థానాలు సైతం చేరుకోలేకపోయింది. ఆ దేశ మాజీలు టీమిండియాకు సలహాలు ఇస్తున్నారు.
పాక్ ప్రస్తుత కోచ్ అకిబ్ జావేద్‌ను చూసి నేర్చుకోవాలని హెడ్‌కోచ్ గంభీర్‌కు మాజీ కెప్టెన్ బాసిత్ అలీ సూచించాడు. భారత క్రికెట్ జట్టులో సూపర్ స్టార్ సంస్కృతిని తొలగించాలని.. పాక్ జట్టులో జావేద్ అదే చేశాడని చెప్పుకొచ్చారు. గంభీర్ కోచింగ్‌లో టీం ఇండియా ప్రదర్శన అంత బాగాలేదని అలీ పేర్కొన్నారు. న్యూజిలాండ్‌తో స్వదేశంలో టెస్ట్ సిరీస్, అలాగే ఆస్ట్రేలియాలోనూ ఓటమిపాలైంది. అదే సమయంలో ఇంగ్లాండ్‌తో జరిగిన మూడు టెస్టుల సిరీస్‌లో మధ్యలోనే బాబర్ ఆజం, షాహీన్ అఫ్రిది, నసీమ్ షాలను జావేద్ తొలగించాడని.. దాంతోనే ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌ను గెలిచిందని తెలిపాడు. గౌతమ్ గంభీర్ సైతం సరిగా రాణించని ఆటగాళ్లను తొలగించాలని.. స్థిరంగా ఆడేవారిని తీసుకోవాలని సూచించారు.
సూపర్ స్టార్ సంస్కృతిని ముగించి.. వారికి ప్రత్యామ్నాయం లేదని భావించే స్థానంలో కొత్తవారిని తీసుకువచ్చి.. అందరూ సమానమేనని జావేద్ చేసి చూపించాడని మాజీ పాక్ కెప్టెన్ పేర్కొన్నాడు. పాక్ మాజీ కెప్టెన్ టీమిండియాకు సలహాలు ఇవ్వడంపై పలువురు మాజీలు విమర్శిస్తున్నారు. ప్రపంచ టెస్ట్ చాంపియన్ షిప్ పాయింట్ల పట్టికలో ఉన్న తొమ్మిది జట్లలో పాక్ ఎనిమిదో స్థానంలో ఉన్నది. గత టెస్ట్ సైకిల్లో 12 మ్యాచుల్లో కేవలం నాలుగు మాత్రమే దాయాది గెలిచింది. ఆ దేశానికి 27.78పాయింట్లు ఉన్నారు. ఇదే సైకిల్లో టీమిండియా 19 టెస్టులు ఆడి.. తొమ్మిది గెలిచింది. ఎనిమిది మ్యాచుల్లో ఓటమి పాలు కాగా.. రెండు టెస్టులు డ్రా చేసుకుంది. ప్రస్తుతం టీమిండియా 50 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. ఆస్ట్రేలియా 63.73 పాయింట్ల శాతంతో రెండు, దక్షిణాఫ్రికా 69.44 పాయింట్లతో మొదటి స్థానంలో ఉన్నది.