Tamim Iqbal : బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ తమీమ్ ఇక్బాల్ (Tamim Iqbal) కీలక నిర్ణయం తీసుకున్నాడు. సుదీర్ఘ కాలం ఓపెనర్‌గా జట్టుకు విశేష సేవలందించిన అతడు తమ దేశ క్రికెట్ బోర్డు(Bangladesh Cricket Board) ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతున్నాడు. అక్టోబర్‌లో జరుగబోయే బోర్డు సభ్యుల ఎన్నికల్లో ఈ మాజీ ఓపెనర్ బరిలోకి దిగుతున్నాడు. ఒకవేళ సభ్యుడిగా గెలిస్తే అధ్యక్ష పదవిని దక్కించుకునేందుకు ప్రయత్నిస్తానిని తమీమ్ తెలిపాడు.
‘అక్టోబర్‌లో జరుగబోయే బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు సభ్యుల ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను. నాకు రెండు క్లబ్స్ మద్దతు ఉంది. సభ్యుడిగా ఎంపికయ్యాక అధ్యక్ష పదవి గురించి ఆలోచిస్తాను. ఎందుకుంటే.. ఇప్పుడే అధ్యక్షుడిని అవుతానని చెప్పడం అవివేకం అవుతుంది. ప్రస్తుతం బ బోర్డు సభ్యుల మధ్య సఖ్యత లేదు. బోలెడన్ని అబద్ధాలు చెబుతున్నారు. దాంతో.. బంగ్లా క్రికెట్ ప్రతిష్ఠ దెబ్బతింటోంది. అవకాశం వస్తే ఇవన్నీ మార్చాలని అనుకుంటున్నాను’ అని తమీమ్ వెల్లడించాడు.
Former captain Tamim Iqbal sets sights on October elections for Bangladesh’s top opening player award, ending months of speculation about his role in cricket administration.#TamimIqbal #CricketBuzz pic.twitter.com/V1mDGN2rwd
— Today in Bengal (@TodatB1) August 31, 2025
బంగ్లా క్రికెట్ బోర్డులో 25 మంది సభ్యులు ఉంటారు. ఎన్నికలు ముగిసిన తర్వాత బీసీబీ రాజ్యాంగం ప్రకారం.. కేటగిరీ 1లో ఢాకాకు చెందిన క్లబ్స్‌కు చెందిన 76 మంది కౌన్సిలర్లు 12 మంది డైరెక్టర్లను ఎన్నుకుంటారు. రెండో కేటగీరిలో జిల్లా, ప్రాంతీయ క్లబ్స్‌కు చెందిన ప్రతినిధులు పాల్గొంటారు. 10 మంది సభ్యులను 8 డివిజన్లు, 64 జిల్లాల్లోని కౌన్సిలర్లు ఎన్నుకుంటారు. కేటగిరీ 3లో ఒక పోస్ట్ ఉంటుంది. ఇతర ప్రతినిధులు కోటా ప్రకారం ఒక సభ్యుడిని ప్రకటిస్తారు. ఇద్దరు డైరెక్టర్లున జాతీయ క్రీడా మండలి నామినేట్ చేస్తుంది.
తమీమ్ 2007లో వన్డేల్లో ఆరంగేట్రం చేశాడు. అనతి కాలంలోనే బంగ్లాదేశ్ తరఫున అన్ని ఫార్మాట్లలో ఉత్తమ బ్యాటర్‌గా ఎదిగాడు. పసికూనగా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన బంగ్లా.. పెద్ద జట్లకు షాక్ ఇవ్వడంలో ఈ లెఫ్ట్ హ్యాండర్ ఓపెనర్ పాత్ర ఎంతో ఉంది. మరో విషయం ఏంటంటే.. అతనికి టీమిండియా(Team India) పై ఘనమైన రికార్డు ఉంది. అవును.. అతడి 56 అర్ధ శతకాల్లో భారత్‌పై చేసినవే ఎక్కువ. ఓపెనింగ్ బ్యాటర్ అయిన తమీమ్ సంచలన ఇన్నింగ్స్‌లకు చిరునామాగా మారాడు. మొదటి బంతి నుంచే బౌలర్లపై విరుచుకుపడే అతను బంగ్లా జట్టుకు దూకుడు నేర్పాడు. కీలక మ్యాచుల్లో మెరపు బ్యాటింగ్ చేసి జట్టును గెలిపించిన సందర్భాలు ఎన్నో.
పేసర్ ముష్రఫే మొర్తాజా (Mashrafe Mortaza) నుంచి తమీమ్ 2020లో వన్డే జట్టు సారథిగా ఎంపికయ్యాడు. అతడి కెప్టెన్సీలో బంగ్లా 37 మ్యాచుల్లో 21 సార్లు గెలుపొందింది. టెస్టుల్లోనూ ఈ లెఫ్ట్ హ్యాండర్ 10 శతకాలతో సత్తా చాటాడు. అతను 2009లో వెస్టిండీస్ పర్యటన (Westindies Tour)లో తొలి సెంచరీ చేశాడు. ఆ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ విండీస్‌ను ఓడించి, విదేశీ గడ్డపై తొలి విజయం నమోదు చేసింది. స్వదేశంలో ఈ మధ్యే అఫ్గనిస్థాన్‌తో జరిగిన ఏకైక టెస్టుకు ఇక్బాల్ దూరమయ్యాడు. అయితే.. వన్డే సిరీస్‌లో మాత్రం ఆడాడు.