Alexandra Paul | కారు యాక్సిడెంట్లో మాజీ ఒలింపియన్ దుర్మరణం
Alexandra Paul : ఒలింపియన్, ప్రొఫెషనల్ ఫిగర్ స్కేటర్ అలెగ్జాండ్రియా పాల్(Alexandra Paul) దుర్మరణం పాలైంది. కెనడాలో మంగళవారం జరిగిన కారు ప్రమాదం(Car accident)లో ఆమె ప్రాణాలు కోల్పోయింది. టొరంటో(Toronto) పట్టణానికి 112 కిలోమీటర్ల దూరంలో ఈ దుర్ఘటన జరిగింది. నిర్మాణ దశలో ఉన్న టౌన్ షిప్ నుంచి రోడ్డు మీదకు వచ్చిన...
Alexandra Paul : ఒలింపియన్, ప్రొఫెషనల్ ఫిగర్ స్కేటర్ అలెగ్జాండ్రియా పాల్(Alexandra Paul) దుర్మరణం పాలైంది. కెనడాలో మంగళవారం జరిగిన కారు ప్రమాదం(Car accident)లో ఆమె ప్రాణాలు కోల్పోయింది. టొరంటో(Toronto) పట్టణానికి 112 కిలోమీటర్ల దూరంలో ఈ దుర్ఘటన జరిగింది. నిర్మాణ దశలో ఉన్న టౌన్ షిప్ నుంచి రోడ్డు మీదకు వచ్చిన ఒక పెద్ద ట్రక్కు అదుపు తప్పి ఏడు వాహనాలను ఢీ కొట్టింది. అందులో అలెగ్రాండ్రియా నడుపుతున్న కారు కూడా ఉంది. ఆ సమయంలో కారులో ఆమె, పది నెలల కొడుకు ఉన్నాడు. అయితే.. అలెగ్జాండ్రిమా అక్కడిక్కడే ప్రాణాలు విడిచింది. ఈ ప్రమాదంలో ఆమె కొడుకు మాత్రం సరక్షితంగా బయటపడ్డాడు.
అలెగ్రాండ్రియా తన భర్త మిచెల్ ఇస్లాం(Mitchell Islam)తో కలిసి కెనడా తరఫున 2014 వింటర్ ఒలింపిక్స్(2014 Winter Olympics)లో పాల్గొంది. మిక్స్డ్ ఐస్ డాన్స్(mixed ice dance) పోటీల్లో వీళ్లు 18వ స్థానంలో నిలిచారు. వీళ్లిద్దరికి 2009 నుంచే పరిచయం ఉంది. జంటగా స్కేటింగ్ ప్రాక్టీస్ చేసేవాళ్లు.
భర్త మిచెల్, కొడుతో అలెగ్రాండ్రియా

పలు వేదికలపైన ఎన్నో అవార్డులు అందుకున్నారు. మనసులు కలవడంతో 2021లో పెళ్లితో ఒక్కటయ్యారు. దాంతో, స్కేటింగ్‌కు వీడ్కోలు పలికిన అలెగ్రాండ్రియా జ్యూరిస్ డాక్టర్ డిగ్రీ సంపాదించింది. నిరుడే ఈ జంటకు పండంటి బాబు పుట్టాడు. అంతా మంచిగా జరుగుతున్న సమయంలో ట్రక్కు రూపంలో మృత్యువు అలెగ్రాండ్రియాను కబలించింది. ఉజ్వల భవిష్యత్తు ఉన్న ఆమె31 ఏళ్లకే కన్నుమూయడం పట్ల విచారం వ్యక్తం చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
MS Dhoni | ధోనీ కాళ్లకు నమస్కరించిన అభిమాని.. మహీ భాయ్ రియాక్షన్ ఇదే..!
Asia Cup 2023 | ఆరేళ్ల తర్వాత స్టార్ ఆల్‌రౌండర్‌కు పిలుపు.. అఫ్గనిస్థాన్ స్క్వాడ్ ఇదే
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

