Asia Cup 2023 : అఫ్గనిస్థాన్ క్రికెట్ బోర్డు ఈరోజు ఆసియా కప్(Asia Cup 2023) బృందాన్ని ప్రకటించింది. 17 మందితో కూడిన బృందానికి హష్మతుల్లా షహీదీ(Hashmatullah Shahidi)కి సారథ్య బాధ్యతలు అప్పగించింది. పాకిస్థాన్ చేతిలో మూడు వన్డేల్లో ఓటమి నేపథ్యంలో సెలెక్టర్లు జట్టు ఎంపికలో భారీ కసరత్తే చేశారు. ఆల్‌రౌండర్ కరీం జనత్(Karim Janat)కు ఆరేళ్ల తర్వాత జట్టులోకి తీసుకున్నారు.
అజ్మతుల్లా ఒమర్జాయ్ బదులు చివరి వన్డేలో ఆడిన గుల్బదిన్ నయీబ్(Gulbadin Naib) కూడా స్క్వాడ్‌లో చోటు దక్కించుకున్నాడు. ఆసియా కప్ పోటీలు ఆగస్టు 30న మొదలవ్వనున్నాయి. అఫ్గనిస్థాన్ సెప్టెంబర్ 3న తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను ఢీ కొననుంది.
Here’s AfghanAtalan’s lineup for the ACC Men’s Asia Cup 2023. 🤩#AfghanAtalan | #AsiaCup2023 pic.twitter.com/kHHmR2GhxO
— Afghanistan Cricket Board (@ACBofficials) August 27, 2023
అఫ్గనిస్థాన్ బృందం : హష్మతుల్లా షహీదీ(కెప్టెన్), ఇబ్రహీం జర్డాన్, రియాజ్ హసన్, రహ్మనుల్లా గుర్బాజ్(వికెట్ కీపర్), నజీబుల్లా జర్డాన్, రషీద్ ఖాన్, ఇక్రం అలీ ఖాన్, కరీం జనత్, గుల్బదిన్ నయీబ్, మహ్మద్ నబీ, ముజీబ్ ఉర్ రెహ్మాన్, ఫజల్హక్ ఫారుఖీ, షరఫుద్దీన్ అష్రఫ్, నూర్ అహ్మద్, అద్దుల్ రహ్మన్, మహ్మద్ సలీం.
ఆల్‌రౌండర్ కరీం జనత్
టీ20 స్పెషలిస్ట్ అయిన కరీం జాతీయ జట్టు తరఫున 2017లో జింబాబ్వేపై చివరి టెస్టు ఆడాడు. అప్పటి నుంచి అతను ఒక్క వన్డే కూడా ఆడలేదు. ఇప్పటి వరకూ కరీం 49 టీ20లు మాత్రమే ఆడాడు. అఫ్గనిస్థాన్ ఏ జట్టు తరఫున 42 మ్యాచ్‌లు ఆడిన ఈ ఆల్‌రౌండర్ 1,664 పరుగులు చేశాడు. బౌలింగ్‌లో ఐదు వికెట్ల ప్రదర్శనతో మెరిశాడు.