MS Dhoni : భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ(MS Dhoni) మైదానంలో కనిపించినా, బయట తారసపడినా అభిమానులకు పండగే. ‘ధోనీ.. ధోనీ’ అంటూ అతడిని చుట్టుముడతారు. అంతేకాదు ఈ దిగ్గజ ఆటగాడితో ఒక్క సెల్ఫీ దిగినా చాలు అనుకునేవాళ్లు కోకొల్లలు. ఫ్యాన్స్‌ను ప్రేమగా పలకరించే మహీ భాయ్ తాజాగా మరోసారి వార్తల్లో నిలిచాడు.
ఒక అభిమాని మహీ కాళ్లకు నమర్కరించింది. ఊహించని పరిణామంతో షాక్ తిన్న ధోనీ ఆమెను వారించాడు. ‘కాళ్లు మొక్కడం కంటే షేక్ హ్యాండ్ ఇవ్వాల’ని సూచించాడు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
A fan touched MS Dhoni’s feet upon meeting her idol.
An icon – MS…!! pic.twitter.com/RPaqFZv8xm
— Mufaddal Vohra (@mufaddal_vohra) August 27, 2023
ఐపీఎల్ 16వ సీజన్(IPL 2023)లో గాయపడిన ధోనీ ఈమధ్యే మోకాలు సర్జరీ(Knee Surgery) చేయించుకున్నాడు. ప్రస్తుతం అతను రాంచీలోని తన నివాసంలో కోలుకుంటున్నాడు. టికెట్ కలెక్టర్‌గా పని చేస్తూనే ధోనీ క్రికెటర్ అవ్వాలనే కలను నిజం చేసుకున్నాడు. కెప్టెన్‌గా భారత జట్టుకు ఎన్నో గొప్ప విజయాలు అందించాడు.
మహేంద్ర సింగ్ ధోనీ
టీమిండియాకు మూడు ఐసీసీ ట్రోఫీ(ICC Trophy)లు సాధించి పెట్టిన తొలి కెప్టెన్‌గా మహీ చరిత్రపుటల్లో నిలిచాడు. 2020 ఆగస్టులో క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ధోనీ ఐపీఎల్లో మాత్రం కొనసాగుతున్నాడు. అతడి సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్(chennai super kings) 16వ సీజన్లో ట్రోఫీని ముద్దాడింది. దాంతో, ఐదు ఐపీఎల్ టైటిళ్లు గెలిచిన రెండో జట్టుగా రికార్డు సృష్టించింది.