వన్డేల్లో పూర్తిస్థాయి కెప్టెన్‌గా తొలి విజయం నమోదు చేసిన రోహిత్ శర్మపై విండీస్ మాజీ దిగ్గజం ఇయాన్ బిషప్ ప్రశంసల జల్లు కురిపించాడు. గతేడాది నవంబరులో హ్యామ్‌స్ట్రింగ్ గాయంతో టీమిండియాకు దూరమైన రోహిత్.. బెంగళూరులోని ఎన్సీఏలో రికవర్ అయ్యాడు. ఈ కారణంగా సఫారీ టూర్‌కు పూర్తిగా దూరమయ్యాడు.
అనంతరం అతను ఆడిన తొలి అంతర్జాతీయ మ్యాచ్ వెస్టిండీస్‌తో జరిగిన వన్డేనే. దీనిలో అతని టైమింగ్, షాట్లు అద్భుతంగా ఉన్నాయని బిషప్ కొనియాడాడు. అంతకాలం గ్యాప్ తీసుకున్న తర్వాత కూడా చక్కటి టైమింగ్‌తో ఆడగలిగేది అత్యుత్తమ ఆటగాళ్లే అని బిషప్ అన్నాడు. ఈ ఫార్మాట్లో రోహిత్ ఒక ఆల్‌టైం గ్రేట్ అంటూ కితాబిచ్చాడు.
‘మనం ఇప్పటి వరకూ చూసిన రోహిత్ ఆటతీరే అది. అతని టైమింగ్, బ్యాలెన్స్ సూపర్‌గా ఉన్నాయి. యాక్టివ్ క్రికెట్ నుంచి చాలాకాలం గ్యాప్ తర్వాత తిరిగొచ్చి అంత అద్భుతంగా ఆడటం నన్ను చాలా ఆశ్చర్యపరిచింది. ఆ ఆటతీరు సాధారణ ఆటగాళ్లది కాదు. అత్యుత్తమ ఆటగాళ్లది. ఇంతకాలం రోహిత్‌ను చూస్తున్నాం కదా.. అతనో అద్భుతమైన ఆటగాడు. ఈ ఫార్మాట్లో ఆల్‌టైం గ్రేట్స్‌లో ఒకడు’ అంటూ బిషప్ ప్రశంసలు కురిపించాడు.
అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియంలో జరిగిన తొలి వన్డేలో భారత జట్టు ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇది భారత జట్టుకు 1000వ వన్డే కావడం గమనార్హం. విండీస్ సిరీస్‌లో రెండో వన్డే బుధవారం నాడు అహ్మదాబాద్‌లోనే జరగనుంది.