న్యూఢిల్లీ: ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ కోచ్గా భారత మాజీ క్రికెటర్ మునాఫ్ పటేల్ ఎంపికయ్యాడు. రానున్న ఐపీఎల్ సీజన్లో ఢిల్లీ జట్టుకు మునాఫ్ సేవలందించనున్నాడు. రికీ పాంటింగ్ స్థానంలో కొత్తగా వచ్చిన చీఫ్ కోచ్ హేమాంగ్ బదానీతో కలిసి పటేల్ పనిచేయనున్నాడు. 2018లో అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన ఈ 41 ఏండ్ల వెటరన్ బౌలర్ భారత్ 86 మ్యాచ్ల్లో 125 వికెట్లు పడగొట్టాడు. దీనికి తోడు 2011లో వన్డే ప్రపంచకప్ గెలిచిన టీమ్ఇండియాలో మునాఫ్ సభ్యుడు.
పాక్ టూర్ అనుమతికి నిరీక్షణ
న్యూఢిల్లీ: పాకిస్థాన్లో అంధుల టీ20 ప్రపంచకప్లో ఆడేందుకు భారత జట్టు.. కేంద్ర హోం, విదేశాంగ శాఖల అనుమతి కోసం వేచిచూస్తున్నది. ఈనెల 22 నుంచి మొదలుకానున్న అంధుల టీ20 ప్రపంచకప్లో భారత్ ఆడాల్సి ఉంది. అయితే కేంద్ర ప్రభుత్వ అనుమతి లేనిదే పాక్కు వెళ్లలేమని, నిర్ణయం కోసం వేచిచూస్తున్నామని అసోసియేషన్ కార్యదర్శి శైలేందర్ పేర్కొన్నారు.