Vaping : పంతొమ్మిదో సీజన్ ఐపీఎల్లో కొందరు ఆటగాళ్లు మైదానంలో ప్రదర్శన కంటే ఇతర చేష్టలతో వివాదాల్లో నిలుస్తున్నారు. మొన్నటికి మొన్న రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్(Riyan Parag) వేపింగ్(ఈ సిగరేట్) చేస్తూ పట్టుబడ్డాడు. ఇప్పుడు పంజాబ్ కింగ్స్ స్పిన్నర్ యజ్వేంద్ర చాహల్ (Yuzvendra Chahal) వేపింగ్ వీడియో వైరలవుతోంది. జట్టు సభ్యులతో కలిసి విమానంలో వెళ్తున్న చాహల్ వేపింగ్ చేయడాన్ని పలువురు తప్పుపడుతున్నారు. భారత మాజీ ఆటగాడు లక్ష్మణ్ శివరామకృష్ణన్(Laxman Ramakrishnan) ఏకంగా.. చాహల్‌ను జైల్లో పెట్టాలని డిమాండ్ చేస్తున్నాడు.
ఐపీఎల్-19లో కొందరు వేపింగ్ భూతాన్ని వదలడం లేదు. డ్రెస్సింగ్ రూమ్‌లో ఈ సిగరెట్ తాగుతూ ఐపీఎల్ కోడ్ ఉల్లంఘనకు పాల్పడిన పరాగ్‌కు జరిమానా విధించినా మార్పు కనిపిస్తలేదు. తాజాగా పంజాబ్ కింగ్స్ ఆటగాడు యజ్వేంద్ర చాహల్ వేపింగ్ చేయడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Yuzvendra Chahal का एक वीडियो सोशल मीडिया पर वायरल हो रहा है, जिसमें fans ने उन्हें flight में vaping करते हुए claim किया। हालांकि कई users इसे की हालिया controversy पर मजाकिया dig मान रहे हैं। #YuzvendraChahal #vaping #controversy #cricket #ipl #smoking pic.twitter.com/z8DjbAbaep
— Webdunia Hindi (@WebduniaHindi) May 8, 2026
‘భారత్‌లో వేపింగ్‌పై నిషేధం ఉంది. కాబట్టి నిబంధనలను ఉల్లంఘించిన చాహల్‌ను జైల్లో పెట్టాలి. చట్టాలను అమలు చేయనప్పుడు అవి ఉండి ఎందుకు? మ్యాచ్ ఫీజులో 25 శాతం జరిమానా అనేది చాలా చిన్నది. వేపింగ్ అలవాటున్న వ్యక్తి పదేపదే ఇలా చేస్తుంటే.. ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది?’ అని ప్రశ్నించిన శివరామకృష్ణన్ ఈమధ్యే బీసీసీఐ కామెంటేటర్‌గా వైదొలిగిన విషయం తెలిసిందే.
ఇంతకూ చాహల్ వేపింగ్ వీడియో బయటకురావడానికి కారణం పంజాబ్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్. ఇన్‌స్టా రీల్స్ తీసే అలవాటున్న అర్ష్‌దీప్ ఎప్పటిలానే వీడియో తీయగా.. చాహల్ వేవింగ్ చేస్తూ దొరికిపోయాడు. ఈ వైరల్ వీడియోపై ఐపీఎల్ పాలకమండలి ఏం చర్యలు తీసుకుంటోందో చూడాలి.
🚨 PUNJAB KINGS BAN ARSHDEEP SINGH FROM MAKING VIDEOS 🚨
• The Punjab Kings management has strictly prohibited Arshdeep Singh from creating vlogs or YouTube videos during the IPL.
• Meanwhile, Yuzvendra Chahal has received a strict warning regarding a vaping-related… pic.twitter.com/xMD2HBurIb— Cricket Central (@CricketCentrl) May 8, 2026