Bangladesh : ఆసియా కప్‌లో బ్యాటింగ్ వైఫల్యంతో సెమీస్‌కు ముందే ఇంటిదారి పట్టిన బంగ్లాదేశ్ ఆపై ఆఫ్గనిస్థాన్ (Afghanistan) చేతిలో వైట్‌వాష్‌కు గురైంది. ఇటీవలి కాలంలో ఆ జట్టు బ్యాటింగ్ యూనిట్ ప్రదర్శన ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) కీలక నిర్ణయం తీసుకుంది. స్వదేశంలో ఐర్లాండ్‌తో సిరీస్‌కు ముందు కొత్త బ్యాటింగ్ కోచ్‌ను నియమించింది. విధ్వంసక ఆటగాడు, మాజీ క్రికెటర్ అ యిన మొహమ్మద్ అష్రఫుల్ (Mohammad Ashraful)కు బాధ్యతలు కట్టబెట్టింది. సీనియర్ అసిస్టెంట్ కోచ్ అయిన మొహమ్మద్ సలాహుద్దిన్ స్థానాన్ని అష్రాఫుల్ భర్తీ చేయనున్నాడు.
ఒకప్పుడు బంగ్లాదేశ్ విజయాల్లో కీలకమైన అష్రాఫుల్ వీడ్కోలు తర్వాత దేశవాళీలో కోచ్‌గా సేవలందించాడు. గ్లోబల్ సూపర్ లీగ్స్‌లోనూ బ్యాటింగ్ కోచ్‌గా పనిచేసిన అనుభవం అతడికుంది. అందుకే అతడి సేవల్ని ఉపయోగించుకోవాలనుకుంది బంగ్లా బోర్డు. వచ్చే ఏడాది టీ20 వరల్డ్ కప్, ఆ తర్వాత వన్డే ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకొని అష్రఫుల్కు బ్యాటింగ్ కోచ్‌గా బాధ్యతలు అప్పగించింది.
🚨 BREAKING
Mohammed Ashraful has been appointed as the batting coach of Bangladesh. 🇧🇩
Hope your new role leads you and Bangladesh to glory, Ash! ✨#BangladeshCricket #fblifestyle pic.twitter.com/uy97euPUYB
— Cricketangon (@cricketangon) November 3, 2025
‘అంతర్జాతీయ క్రికెట్ అనుభవం కలిగిన అష్రఫుల్ కోచ్‌గానూ మెప్పించాడు. అతడి అనుభవం జట్టుకు ఎంతో ఉపయోగపడనుంది’ అని బీసీబీ డైరెక్టర్ అబ్దుర్ రజాక్ వెల్లడించాడు. స్వదేశంలో ఐర్లాండ్‌తో రెండు టెస్టులు, ఆపై మూడు టీ20లు ఆడనుంది బంగ్లా. విధ్వంసక ఆటగాళ్లలో ఒకడైన అష్రఫుల్17 ఏళ్ల వయసులోనే టెస్టు సెంచరీతో వార్తల్లో నిలిచాడు. భారత్‌పైనే 158 నాటౌట్‌తో అత్యధిక స్కోర్ నమోదు చేశాడీ హిట్టర్. 2001లో వన్డేల్లో అరంగేట్రం చేసిన అతడు ఆస్ట్రేలియాపై సెంచరీతో జట్టును గెలిపించాడీ డాషింగ్ బ్యాటర్.