భారత మాజీ ఫుట్‌బాలర్, దిగ్గజ క్రీడాకారుడు సుభాష్ భోమిక్ కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న 72 ఏళ్ల సుభాష్.. శనివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. సుభాష్ భోమిక్ను అభిమానులు ప్రేమతో ‘భోంబోల్డా’ అని పిలిచేవారు.
డయాబెటిక్ సమస్యలు, కిడ్నీ ఇబ్బందులతో ఆయన ఆస్పత్రిలో చేరినట్లు తెలుస్తోంది. ఈస్ట్ బెంగాల్ మోహన్ బగన్ జట్ల తరఫున ఫుట్‌బాల్ ఆడిన సుభాష్.. టీంలో స్ట్రైకర్‌గా ఉండేవాడు. చాలా అంతర్జాతీయ టోర్నమెంట్లలో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. ఈస్ట్ బెంగాల్, మోహన్ బగన్, మొహమ్మదీన్ స్పోర్టింగ్, సాల్గోకార్, చర్చిల్ బ్రదర్స్ వంటి క్లబ్స్‌కు కోచ్‌గా వ్యవహరించారు.