Suresh Raina | చిక్కుల్లో సురేశ్ రైనా.. బెట్టింగ్ యాప్ కేసులో విచారణకు రావాలని ఈడీ నోటీసులు..!
Suresh Raina | టీమిండియా మాజీ ప్లేయర్ సురేష్ రైనా చిక్కుల్లోపడ్డాడు. ఆన్లైన్ బెట్టింగ్ యాప్‌కు సంబంధించి బుధవారం విచారణకు హాజరు కావాలంటూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసింది. అక్రమ బెట్టింగ్ యాప్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో విచారణకు రావాలని నోటీసుల్లో అధికారులు ఆదేశించినట్లుగా పీటీఐ కథనం పేర్కొంది.
Suresh Raina | టీమిండియా మాజీ ప్లేయర్ సురేష్ రైనా చిక్కుల్లోపడ్డాడు. ఆన్లైన్ బెట్టింగ్ యాప్‌కు సంబంధించి బుధవారం విచారణకు హాజరు కావాలంటూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసింది. అక్రమ బెట్టింగ్ యాప్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో విచారణకు రావాలని నోటీసుల్లో అధికారులు ఆదేశించినట్లుగా పీటీఐ కథనం పేర్కొంది. మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద కేంద్ర దర్యాప్తు సంస్థ అతని వాంగ్మూలాన్ని నమోదు చేయనున్నది. 1xBet అనే యాప్‌కు సంబంధించిన అక్రమ బెట్టింగ్ కేసులో విచారణ కోసం ఆగస్టు 13న ఏజెన్సీ ముందు హాజరు కావాలని రైనాను కోరినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. యాప్‌కు సంబంధించిన ప్రకటనల్లో సురేశ్ రైనా కనిపించాడు.
అక్రమ బెట్టింగ్ యాప్‌లకు సంబంధించిన కేసులను ఈడీ దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే. బెట్టింగ్ యాప్స్ చాలా మంది వ్యక్తులతో పాటు పెట్టుబడిదారులను రూ.కోట్లల్లో మోసం చేయడంతో పాటు భారీ మొత్తంలో పన్ను ఎగవేసినట్లు ఆరోపణలున్నాయి. సురేశ్ రైనా టీమిండియా మాజీ ప్లేయర్. ఇప్పటి వరకు టీమిండియా తరఫున 322 అంతర్జాతీయ మ్యాచులు ఆడి దాదాపు 8వేల పరుగులు చేశాడు. మూడు ఫార్మాట్లలో సెంచరీ చేసిన తొలి భారతీయ క్రికెటర్ రైనా. ఐపీఎల్‌లోనూ సీఎస్కే తరఫున ఆడాడు. ఐపీఎల్ రైనా కెరీర్ అద్భుతంగా ఉంది. 205 మ్యాచ్‌ల్లో 5,528 పరుగులు చేశాడు. నాలుగు సార్లు సీఎస్కేను చాంపియన్‌గా నిలబెట్టడంలో కీలకపాత్ర పోషించాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. సర్పంచ్ ఫాతిమాభి రాజీనామా!
Kachavaram | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. అభివృద్ధిపై అసంతృప్తితో సర్పంచ్ రాజీనామా..!
కొలనూరులో వీధి కుక్కల స్వైరవిహారం.. దూడ మృతి
Newzealand Cricket | టీమిండియాతో వన్డే సిరీస్.. న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్లకు పిలుపు..!
Telangana | తెలంగాణలో కొత్త జిల్లాలకు పదేళ్లు.. వికేంద్రీకరణ ప్రయాణంపై తొలి సీఎస్ రాజీవ్‌శర్మ కీలక విశ్లేషణ
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

