అడిలైడ్ : ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్, భారత జట్టు మాజీ కోచ్ గ్రెగ్ చాపెల్ పేదరికంలో మగ్గుతున్నాడు. ఆర్థిక ఇబ్బందులతో అల్లాడిపోతున్న అతడిని ఆదుకునేందుకు స్నేహితులు ఆన్లైన్లో నిధుల సేకరణకు సిద్ధమవుతున్నారు. అయితే.. ‘గో ఫండ్ మీ’ పేజీ ద్వారా విరాళాల స్వీకరణకు చాపెల్ అయిష్టంగానే అంగీకరించాడట. ‘మా పరిస్థితి అత్యంత దయనీయంగా ఏమీ లేదు. కానీ, మునుపటిలా విలాసవంతమైన జీవితం గడపలేకపోతున్నా అని చాపెల్ అన్నాడు.