Earth Quake | భూకంపం మిగిల్చిన గుండెకోత.. భార్యాబిడ్డల్ని కోల్పోయిన ఫుట్‌బాలర్..!
Earth Quake : వెనిజువెలాలో సంభవించిన భయానక భూకంపం(Earth Quake) ఓ ఫుట్‌బాలర్ కుటుంబాన్ని కూడా బలిగొన్నది. వందలాదిమందిని పొట్టనబెట్టుకున్న ఈ ప్రకృతి విపత్తు కారణంగా అర్జెంటీనా ఫుట్‌బాలర్ ల్యూకస్ త్రెజో (Lucas Trejo) తన భార్య, పిల్లల్ని కోల్పోయాడు.
Earth Quake : వెనిజువెలాలో సంభవించిన భయానక భూకంపం(Earth Quake) ఓ ఫుట్‌బాలర్ కుటుంబాన్ని కూడా బలిగొన్నది. వందలాదిమందిని పొట్టనబెట్టుకున్న ఈ ప్రకృతి విపత్తు కారణంగా అర్జెంటీనా ఫుట్‌బాలర్ ల్యూకస్ త్రెజో(Lucas Trejo) తన భార్య, పిల్లల్ని కోల్పోయాడు. భూకంపం విషయం తెలిసిన ల్యూకస్ తన భార్యాబిడ్డల ఆచూకీ కోసం మూడు రోజులు గాలించాడు. తనవాళ్లు బతికే ఉంటారనే ఆశతో వెతికిన అతడికి కన్నీళ్లే మిగిలాయి. తన ప్రాణానికి ప్రాణమైన వారిని విగతజీవులుగా చూసిన ఫుట్‌బాలర్ గుండెలవిసేలా రోదించాడు.
జూన్ 24న వెనిజువెలలాలో భూకంపం బీభత్సం సృష్టించింది. తక్కువ లోతులోనే రెండుసార్లు భూమి కంపించడంతో గైరా ప్రాంతంలో భారీసంఖ్యలో ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. భూకంపం సమయంలో ల్యూకస్ శిక్షణ కేంద్రంలో ఉన్నాడు. అతడి భార్య యనీనా, పిల్లలు అరోన్, అనిహోవాలు గైరాలోని బీచ్ సమీపంలోని తమ ఇంట్లో ఉన్నారు. భూకంపం విషయం తెలిసి హుటాహుటిన ల్యూకస్ తమ ఇంటికి వెళ్లాడు. కానీ, అప్పటికే వారి ఇల్లు నేలమట్టమైంది.
🔴 DESPUÉS DE 74 HORAS DE BÚSQUEDA SE CONFIRMA EL FALLECIMIENTO DE LA ESPOSA E HIJOS DEL FUTBOLISTA ARGENTINO LUCAS TREJO QUE MILITA EN EL CS MARÍTIMO DE LA GUAIRA, VÍCTIMAS DEL TERREMOTO. pic.twitter.com/BzszWO37Bf
— COMUNICACIÓN DIGITAL EC (@SamuelVeraZamo1) June 28, 2026
తన భార్యా బిడ్డలు బతికే ఉంటారనే ఆశతో అతడు మూడు రోజులు భవన శిథిలాల్లో వారికోసం వెతికాడు. సహాయక బృందాల సాయం కూడా తీసుకున్నాడు. కానీ, చివరకు ల్యూకస్ భయపడినట్టే వారెవరూ ప్రాణాలతో లేరు. ఊహించని విపత్తు మిగిల్చిన గుండెకోతతో అతడు కుమిలిపోతున్నాడు. ఈ విషాద సమయంలో స్థానిక క్లబ్ స్పోర్ట్ మార్టిమో లా గైరా ల్యూకస్కు అండగా నిలిచింది.
🇻🇪 38-летний аргентинский футболист Лукас Трехо присоединился к клубу “Маритимо Ла Гуайра” в феврале и переехал в Венесуэлу со своей семьёй. Сегодня его жену Янну Маранеллу и двоих детей нашли мертвыми под завалами рухнувшего после землетрясения дома. pic.twitter.com/vBR99LCHCd
— Рустем Адагамов (@adagamov) June 28, 2026
‘ల్యూకస్ నీవు ఒంటరివి కావు. క్లబ్ స్పోర్ట్ మార్టిమో లా గైరా కుటుంబం నీకోసం నిలబడుతుంది’ అని పోస్ట్ పెట్టింది క్లబ్. ల్యూకస్ భార్యాబిడ్డల మరణ వార్త తెలిసి ఫిఫా యాజమాన్యం సంతాపం తెలిపింది. యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన భూకంపం కారణంగా వెనిజువెలాలో 1,400 మందికి పైగా చనిపోయారని, వేలాది మంది ఆచూకీ తెలియాల్సి ఉందని అధికారులు వెల్లడించారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

