IPL Auction 2024: వచ్చే ఏడాది వెస్టిండీస్, అమెరికా వేదికగా జరగాల్సి ఉన్న ఐసీసీ టీ20 వరల్డ్ కప్‌ను దక్కించుకోవడమే లక్ష్యంగా అంతర్జాతీయ స్థాయిలో అన్ని జట్లూ పావులు కదుపుతున్నాయి. భారత క్రికెటర్లు కచ్చితంగా ఆడే ఈ క్యాష్ రిచ్ లీగ్‌లో విదేశాలకు చెందిన క్రికెటర్లు కొంతమంది తమ దేశంలో జరిగే ద్వైపాక్షిక సిరీస్‌లు, వ్యక్తిగత కారణాలతో ఈ లీగ్‌కు దూరంగా ఉండేవాళ్లు.. కానీ వచ్చే ఏడాది పొట్టి ప్రపంచకప్ ఉన్న నేపథ్యంలో విదేశీ క్రికెటర్లంతా దానిమీద ఫోకస్ పెట్టేందుకు ఈ లీగ్‌లో ఆడాలని ఉవ్విళ్లూరుతున్నారు. ప్రపంచకప్‌కు ముందు ఐపీఎల్ ఆడటం అందరికీ సరిపడా ప్రిపరేషన్ అందిస్తుందనడంలో సందేహం లేదు. ప్రపంచ్యవాప్తంగా మెరుగైన ఆటగాళ్లు ఆడే ఈ లీగ్‌లో ఆడితే వచ్చే అనుభవం వరల్డ్ కప్‌లో పనికొస్తుందని ఆటగాళ్లు భావిస్తున్నారు.
ముఖ్యంగా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ క్రికెటర్లు అయితే వేలంలో ఎగబడుతూ తమ పేర్లిచ్చారు. మంగళవారం జరగాల్సిఉన్న వేలంలో మొత్తంగా 333 మంది ఆటగాళ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. 77 స్లాట్స్ మాత్రమే అందుబాటులో ఉన్న ఈసారి వేలంలో 119 మంది విదేశీ ఆటగాళ్లు పేర్లిచ్చారు. 77 స్లాట్స్‌లో 30 స్థానాలు విదేశీ ఆటగాళ్లకు దక్కనున్నాయి.
IPL AUCTION TOMORROW …!!!!pic.twitter.com/nCap5bTMGt
— Mufaddal Vohra (@mufaddal_vohra) December 18, 2023
ఆస్ట్రేలియా నుంచి..
ట్రావిస్ హెడ్, పాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, స్టీవ్ స్మిత్, జోష్ ఇంగ్లిస్, జోష్ హెజిల్వుడ్, ఆస్టన్ టర్నర్, సీన్ అబాట్, అస్టన్ అగర్, వెస్లీ అగర్, బెన్ కటింగ్, మాథ్యూ షార్ట్, రిలీ మెరిడిత్, జై రిచర్డ్సన్, బిల్లీ స్టాంకిల్,
న్యూజిలాండ్ నుంచి..
మాథ్యూ హెన్రీ, స్పెన్సర్ జాన్సన్, ఫిన్ అలెన్, మార్క్ చాప్మన్, కొలిన్ మున్రో, మైకేల్ బ్రాస్‌వెల్, జేమ్స్ నీషమ్, ఇష్ సోధి, డారిల్ మిచెల్, రచిన్ రవీంద్ర, లాకీ ఫెర్గూసన్,
దక్షిణాఫ్రికా నుంచి..
రిలీ రూసో, గెరాల్డ్ కొయెట్జ్, ట్రిస్టన్ స్టబ్స్, తబ్రైజ్ షంసీ, రీజా హెండ్రిక్స్, రస్సీ వాండర్ డసెన్, జార్జ్ లిండె, కేశవ్ మహారాజ్, వియాన్ మల్డర్
వెస్టిండీస్ నుంచి..
రొవ్మన్ పావెల్, అల్జారీ జోసెఫ్, అకీల్ హోసెన్, బ్రాండన్ కింగ్, మాథ్యూ ఫోర్డ్, కీమో పాల్, ఒడియన్ స్మిత్, జాన్సన్ ఛార్లెస్, షై హోప్, ఒబెడ్ మెక్కాయ్