చెంగ్డు (చైనా): ఆసియా అండర్-17, అండర్-15 బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్స్‌లో భారత యువ షట్లర్లు పసిడి పంట పండించేందుకు సిద్ధమయ్యారు. అండర్-17 గర్ల్స్ విభాగంలో లక్ష్య రాజేశ్, దీక్ష సుధాకర్ సెమీస్‌లో తమ ప్రత్యర్థులను చిత్తుచేసి ఫైనల్‌కు చేరారు.
దీంతో ఈ క్యాటగిరీలో స్వర్ణం, రజతం భారత్ సొంతం చేసుకున్నట్టె.. అండర్-15 గర్ల్స్ క్యాటగిరీలో టాప్ సీడ్ షైనా మణిముత్తు కూడా సెమీస్ విజయంతో ఫైనల్ చేరింది. ఆదివారం జరుగబోయే ఫైనల్స్‌లో ఆమె కూడా గెలిస్తే భారత్‌కు రెండు స్వర్ణ పతకాలు ఖాయమవుతాయి.