హైదరాబాద్ ఆట ప్రతినిధి: యువ క్రికెటర్లకు అంతర్జాతీయ స్థాయి అనుభవాన్ని అందించే ందుకు హెచ్‌సీఏ ఐదుగురు ఆటగాళ్లను దిలీప్ వెంగ్‌సర్కార్ క్రికెట్ అకాడమీ యూకే టూర్, మాంచెస్టర్ వేదికగా జరిగే క్రికెట్ ఎక్స్పోజర్ ప్రోగ్రామ్‌కు ఎంపిక చేసింది.
అండర్-19 క్రికెటర్లు నిపుణ్‌రెడ్డి, ఉజైర్ అహ్మద్, అండర్-19 ప్లేయర్లు ఆదిత్య వర్ధన్, పి. ప్రిన్స్, ఆయుష్ మల్హోత్రా జులై 11-16 మధ్య వెంగ్‌సర్కార్ క్రికెట్ అకాడమీ టీమ్ తరఫున ఇంగ్లండ్‌లోని వివిధ మైదానాల్లో 12 మ్యాచ్‌ల్లో పోటీ పడనున్నారు.