SL Vs NZ | గాలె: శ్రీలంక, న్యూజిలాండ్ మధ్య గాలె వేదికగా జరుగుతున్న తొలి టెస్టు రసవత్తరంగా సాగుతోంది. 275 పరుగుల ఛేదనలో భాగంగా రెండో ఇన్నింగ్స్‌లో నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి కివీస్ 207/8గా నిలిచింది. ఆ జట్టు విజయానికి మరో 68 పరుగులు అవసరముండగా క్రీజులో రచిన్ రవీంద్ర (91 నాటౌట్), అజాజ్ పటేల్ (0 నాటౌట్) ఉన్నారు. లంక విజయానికి రెండు వికెట్ల దూరంలో ఉంది.
అనంతపూర్: దేశవాళీ ప్రతిష్టాత్మక దులీప్ ట్రోఫీని మయాంక్ అగర్వాల్ సారథ్యంలోని ఇండియా ‘ఏ’ దక్కించుకుంది. ఆట ఆఖరి రోజు 350 పరుగుల ఛేదనలో ఇండియా ‘సీ’.. 217 పరుగులకు కుప్పకూలడంతో అగర్వాల్ సేన 132 పరుగుల తేడాతో విజయం సాధించింది. సాయి సుదర్శన్ (111) పోరాడినా ‘సీ’కి పరాభవం తప్పలేదు. ప్రసిధ్ (3/50), తనుష్ (3/47) రాణించారు. మూడింటిలో రెండు మ్యాచ్‌లు గెలిచిన ‘ఏ’.. 12 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా ‘సీ’ 9 పాయింట్లతో రన్నరప్‌గా నిలిచింది.