పారిస్: ఫిలిప్పీన్స్‌కు చెందిన జిమ్నాస్ట్ కార్లోస్ యూలో(Gymnast Carlos Yulo).. ఇప్పుడు ఆ దేశంలో ఓ సూపర్ స్టార్. మెన్స్ ఫ్లోర్ ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్, మెన్స్ వాల్ట్ ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్‌లో అతనికి స్వర్ణ పతకాలు గెలిచాడు. కానీ స్వదేశంలో మాత్రం తల్లితో అతను గొడవకు దిగాడు. ఆ ఇద్దరి మధ్య మాటల యుద్ధం సాగుతోంది. తన తల్లికి గర్ల్‌ఫ్రెండ్ నచ్చడంలేదని జిమ్నాస్ట్ కార్లోస్ యూలో తెలిపాడు. అంతేకాదు గతంలో వివిధ టోర్నీల సమయంలో గెలిచిన డబ్బును తన తల్లి వాడేసుకున్నట్లు కూడా అతను ఆరోపించాడు. అయితే ఈ ఇద్దరి గొడవ ఇప్పుడు పిలిప్పీన్స్ మీడియాలో మారుమోగుతున్నది. జిమ్నాస్ట్ కార్లోస్ ఒలింపిక్స్‌లో రెండు స్వర్ణాలు సాధించి హీరో కాగా.. డబ్బు కోసం తల్లితో గొడవపడడం సంచలనంగా మారింది. ఇక అతని గర్ల్‌ఫ్రెండ్ టిక్‌టాక్ స్టార్ కావడంతో .. సోషల్ మీడియాలో ఆ చాంపియన్ ఇంటి సమస్య వైరల్ అయ్యింది.
మనీలాలో జిమ్నాస్ట్ కార్లోస్ రాక కోసం ఏర్పాట్లు జరుగుతుండగా, మరో వైపు అతని అకౌంట్ల నుంచి డబ్బులు మాయం అవుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. తన తల్లి డబ్బును మొత్తం వాడుసుకునేట్లు అతను ఆరోపిస్తున్నాడు. కానీ కార్లోస్ తల్లి మాత్రం ఆ డబ్బును సురక్షితంగా బ్యాంకులో దాచినట్లు చెబుతోంది.