హైదరాబాద్, ఆట ప్రతినిధి: నగరంలోని గచ్చిబౌలి స్టేడియంలో ప్రతిపాదిత ఫిఫా ఫుట్‌బాల్ అకాడమీ మౌలిక సదుపాయాలను అంచనావేయడానికి గాను ఫిఫా, అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఎఐఎఫ్ఎఫ్) ప్రతినిధి బృందం శాట్ జి అధికారులతో స్టేడియాన్ని సందర్శించింది.
గెడీ రాడీ (ఫిఫా), అనిల్‌కుమార్ (ఎఐఎఫ్ఎఫ్ ప్రధాన కార్యదర్శి), ఐఎఫ్ఎస్, ఎస్ఎటిజివిసి, ఏ. సోనిబాలా దేవి నేతృత్వంలోని బృందం.. స్టేడియంలో క్రీడా సౌకర్యాలు, వసతి, శిక్షణ మైదానాలను క్షుణ్ణంగా తనిఖీ చేసింది.