హైదరాబాద్, ఆట ప్రతినిధి: తెలంగాణ తొలి గురుకులాల ఆల్ఇండియా ఫిడే రేటింగ్ చెస్ టోర్నీకి హైదరాబాద్ వేదిక కాబోతున్నది. ఈ నెల 26 నుంచి 30వ తేదీ వరకు యూసుఫ్‌గూడ ఇండోర్ స్టేడియంలో టోర్నీ జరుగనుంది. ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను మంగళవారం ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఆవిష్కరించారు. రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకులాల నిర్వహణలో జరుగుతున్న టోర్నీలో రూ.5 లక్షల ప్రైజ్‌మనీగా ప్రకటించారు.
ఐదు రోజుల పాటు జరిగే ఈ టోర్నీలో ఎంట్రీ ఫీజును రూ. 2500లుగా నిర్వాహకులు నిర్ణయించారు. రాష్ట్రంలోని గురుకులాలు, ప్రభుత్వ, జెడ్పీహెచ్ఎస్ విద్యార్థులకు రూ.1500లుగా ఉంది. ఎంట్రీ ఫీజు చెల్లించేందుకు ఈ నెల 21 ఆఖరి తేదీ అని నిర్వహకులు తెలిపారు. పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో కార్పొరేషన్ చైర్మన్లు రవీందర్‌సింగ్, వాసుదేవారెడ్డి, గురుకులాల కార్యదర్శి రొనాల్డ్ రాస్ పాల్గొన్నారు.