సైప్రస్ : ప్రతిష్టాత్మక క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో భారత యువ గ్రాండ్‌మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద అదిరిపోయే బోణీ కొట్టాడు. ఆదివారం జరిగిన ఓపెన్ కేటగిరీ తొలి పోరులో ప్రజ్ఞానంద 1-0 తేడాతో నెదర్లాండ్స్ జీఎం అనీశ్ గిరిపై అద్భుత విజయం సాధించాడు. తన కంటే మెరుగైన ర్యాంక్‌లో ఉన్న గిరిపై ప్రజ్ఞానంద తనదైన ఆధిపత్యం ప్రదర్శించాడు.
గేమ్‌లో ఒక దశలో గిరి ఆధిక్యం కనబరిచినా అతను చేసిన తప్పిదాన్ని అనుకూలంగా మలుచుకున్న ప్రజ్ఞానంద విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు. మరోవైపు మహిళల కేటగిరీలో దివ్యాదేశ్ముఖ్..అన్నా ముజుచిక్తో గేమ్ డ్రా చేసుకోగా, వైశాలి రాంబాబు, బిబిసారా అసబుయేయా మధ్య గేమ్ డ్రాగా ముగిసింది.