IPL 2025 : పంజాబ్ నిర్దేశించిన 220 పరుగుల ఛేదనలో చెన్నై సూపర్ కింగ్స్(CSK) కీలక వికెట్లు కోల్పోయింది. తొలి వికెట్ పడ్డాక వచ్చిన కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్(1) ఫెర్గూసన్ బౌలింగ్‌లో సులువైన క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 62 వద్ద రెండో వికెట్ పడడంతో.. శివం దూబే ఇంప్యాక్ట్ ప్లేయర్‌గా వచ్చాడు. మరో ఓపెనర్ డెవాన్ కాన్వే 23 పరుగులతో క్రీజులో ఉన్నాడు. 8 ఓవర్లకు సీఎస్కే స్కోర్.. 69-2.
జట్టుకు శుభారంభం అందించాడు. ఓపెనర్ డెవాన్ కాన్వే(22) తో కలిసి పవర్ ప్లేలో 59 రన్స్ జోడించాడు. యశ్ ఠాకూర్ వేసిన 5వ ఓవర్లో హ్యాట్రిక్ ఫోర్లు బాదాడీ యంగ్‌స్టర్. అనంతరం మార్కో యాన్సెస్ బౌలింగ్‌లో బౌండరీతో జట్టు స్కోర్ 50 దాటించాడు. పవర్ ప్లేలో ధాటిగా ఆడిన రచిన్ రవీంద్ర (36)ను మ్యాక్స్‌వెల్ వెనక్కి పంపాడు. ఫ్రంట్ ఫుట్ వచ్చిన రచిన్‌ను.. వికెట్ కీపర్ ప్రభ్‌సిమ్రన్ స్టంపౌట్ చేసి సీఎస్కేకు షాకిచ్చాడు.
FERGU𝟓𝟎N! 🔥 pic.twitter.com/fcJdVjF31d
— Punjab Kings (@PunjabKingsIPL) April 8, 2025
దాంతో, పవర్ ప్లేలో 59తో పటిష్ట స్థితిలో నిలిచిన సీఎస్కే.. మరో రెండు పరుగులకే మొదటి వికెట్ కోల్పోయింది. ఆ కాసేపటికే ఫెర్గూసన్ బౌలింగ్‌లో కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్(1) పేలవమైన షాట్ ఆడి శశాంక్ సింగ్ చేతికి చిక్కాడు. అంతే.. 62 వద్దే రెండో వికెట్ పడింది. గైక్వాడ్‌ను ఔట్ చేయడంతో ఫెర్గూసన్ ఐపీఎల్లో 50 వికెట్ల క్లబ్లో చేరాడు.