కైరో: ప్రతిష్ఠాత్మక ప్రపంచ చాంపియన్‌షిప్‌లో భారత స్టార్ ఫెన్సర్ భవానీదేవికి నిరాశ ఎదురైంది. బుధవారం జరిగిన మహిళల సీనియర్ వ్యక్తిగత సబ్రె విభాగంలో భవాని 12-15 తేడాతో లారిస్సా ఎఫ్లర్(జర్మనీ)తో పోరాడి ఓడింది.
ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ప్రస్తుతం 39వ ర్యాంక్‌లో ఉన్న భవాని..తన తొలి పోరులో 15-14తో గాబ్రియెల్లా(కెనడా)పై శుభారంభం చేసినా..అదే జోరు కొనసాగించలేకపోయింది.