ఢిల్లీ: ప్రఖ్యాత ఫుట్బాల్ ఫ్రాంచైజీ ‘బార్సిలోనా ఎఫ్సీ’ భారత్లో తమ కార్యకలాపాలకు ముగింపు పలికింది. జూలై 1 నుంచి భారత్లో ఉన్న అకాడమీలను మూసివేస్తున్నట్టు తన అధికారిక వెబ్సైట్లో వెల్లడించింది. భారత్లో యువ ఫుట్బాలర్లను ప్రోత్సహించేందుకు గాను ‘బార్కా అకాడమీ’ల పేరిట 2010లో.. భారత్లోని ఢిల్లీ, ముంబై, బెంగళూరు, పుణెలో అకాడమీలను ఏర్పాటు చేసింది. స్పెయిన్లో మాదిరిగా భారత్లో పిల్లలకు ఈ అకాడమీలలో శిక్షణ ఇప్పించింది.