Gautam Gambhir : గ్రెగ్ ఛాపెల్.. ఈ పేరు వింటే చాలు భారత క్రికెట్ పాలిట విలన్ అని చెబుతారు చాలామంది. కెప్టెన్ సౌరవ్ గంగూలీతో విభేదాలు.. డ్రెస్సింగ్ రూమ్‌లో గొడవలకు కారణమైన ఛాపెల్ టీమిండియాను నాశనం పట్టించాడు. చూస్తుంటే గౌతం గంభీర్ (Gautam Gambhir) పేరు కూడా అతడి సరసన చేరేలా ఉంది. స్వదేశంలో భారత జట్టు ఘోరంగా విఫలమవుతుండడమే అందుకు కారణం. కోచ్‌గా అతడి 18 నెలల కాలంలో స్వదేశంలో మన జట్టు ప్రదర్శన అంతకంతకూ దిగజారుతోంది. కోల్‌కతా టెస్టులో 30 పరుగులతో ఓడిన టీమిండియా.. గువాహటిలోనూ అదే ఫలితాన్ని చవిచూసేలా ఉంది. మూడోరోజు భారత ఆటగాళ్లు ఔటైన తీరు చూసిన ఫ్యాన్స్ కోచ్ గంభీర్‌ను ‘ఇండియన్ గ్రెగ్ ఛాపెల్’ అని విమర్శిస్తున్నారు.
రాహుల్ ద్రవిడ్ తర్వాత కోచ్‌గా వచ్చిన గంభీర్ పట్టుబట్టి మరీ తన సొంత టీమ్ ఏర్పాటు చేసుకున్నాడు. వస్తూ వస్తూనే సీనియర్లు రోహిత్ శర్మ (Rohit Sharma), విరాట్ కోహ్లీ (Virat Kohli)లను పక్కన పెట్టేసిన అతడు పలు ప్రయోగాలకు తెరతీశాడు. అయినా సరే అతడి నేతృత్వంలో టీమిండియా పెద్దగా అద్భుతాలు చేయలేదు. స్వదేశంలో న్యూజిలాండ్ (Newzealand) చేతిలో టీమిండియా వైట్‌వాష్‌తో అవమానం మూటగట్టుకున్న గంభీర్.. ఆపై ఆస్ట్రేలియా గడ్డపైనా తన ముద్ర వేయలేకపోయాడు. కంగారూల దెబ్బకు బోర్డర్ – గవాస్కర్ సిరీస్ చేజార్చుకుంది భారత్. అంతే.. కోచ్‌గా పనికిరాడంటూ గంభీర్‌పై విమర్శలు వెల్లువెత్తాయి.
Gautam Gambhir is becoming the Greg Chappell 2.0 of Indian cricket. pic.twitter.com/B57A5ZHMWf
— 𝐑𝐮𝐬𝐡𝐢𝐢𝐢⁴⁵ (@rushiii_12) November 24, 2025
అయితే.. శుభ్‌మన్ గిల్ కొత్త నాయకుడిగా ఇంగ్లండ్ పర్యటనలో టీమిండియా గొప్పగా ఆడింది. ఓవల్ టెస్టులో సిరాజ్ సంచలన బౌలింగ్‌తో సిరీస్‌ను సమం చేయడంతో గంభీర్ ఊపిరిపీల్చుకున్నాడు. ఆ వెంటనే సొంతగడ్డపై వెస్టిండీస్‌ను వణికించి రెండు టెస్టుల సిరీస్‌ను గిల్ సేన క్లీన్‌స్వీప్ చేసింది. ఈ సిరీస్ విజయంతో మళ్లీ స్వదేశంలో భారత ఆధిపత్యం మొదలైందని అనుకున్నారంతా. కానీ.. డబ్ల్యూటీసీ విజేత దక్షిణాఫ్రికా నిరూపిస్తోంది.
Meet Gautam Gambhir 🤡
– Took charge after the T20 World Cup
– We got whitewashed vs Sri lanka and NZ and lost odi series vs Australia
– Lost the BGT
– Made Kohli and Rohit retire from Tests
– Removed icc trophy winning captain from captaincy
– Now we’re losing to Sa at home. pic.twitter.com/ReRqvblXXd— Abhishek Kumar (@Abhishek060722) November 24, 2025
కోల్‌కతా టెస్టులో భారత జట్టు అనూహ్యంగా 30 పరుగుల తేడాతో ఓడింది. తొలి రెండు రోజులు దక్షిణాఫ్రికాను హడలెత్తించిన భారత జట్టు మూడోరోజు మ్యాచ్‌ను అప్పగించేసింది. ఈ మ్యాచ్‌కు జట్టు ఎంపిక నుంచి బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులతో విమర్శల పాలయ్యాడు గంభీర్. సాయి సుదర్శన్‌ను పక్కన పెట్టి వాషింగ్టన్ సుందర్‌ను మూడో స్థానంలో ఆడించడం తీవ్ర విమర్శలకు దారితీసింది.
New Zealand become the 1st side to whitewash India in a home Test series since 2000 🇳🇿👊#INDvNZ pic.twitter.com/X3Zg0cKbjj
— Sport360° (@Sport360) November 3, 2024
ఇప్పుడు గువాహటిలోనూ గౌతీ వ్యూహాలు ఫలించలేదు. కెప్టెన్ రిషభ్ పంత్ వైఫల్యమూ ఓ కారణమైనా కోచ్‌గా గంభీర్ ప్రభావం చూపలేకపోయాడనేది వాస్తవం. ఇప్పటివరకూ గౌతీ హయాంలో 18 టెస్టులు ఆడిన భారత జట్టు కేవలం ఏడంటే ఏడే విజయాలతో నిరాశపరిచింది. 9 మ్యాచ్‌ల్లో పరాజయం ఎదురవ్వగా.. రెండు డ్రాగా ముగిశాయి. గువాహటిలోనూ ఓటమి తప్పేలా లేదు. ఎందుకంటే.. తొలి ఇన్నింగ్స్‌లో 201కే ఆలౌటై సఫారీలకు 288 పరుగుల ఆధిక్యం సమర్పించుకున్న భారత్.. గువాహటి టెస్టును కాపాడుకోవడం శక్తికిమించిన పనే.