Virat Kohli : భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ(Virat Kohli) ఆటకు ఫిదా అవ్వని వాళ్లు ఉండరు. అందునే ఈ స్టార్ ఆటగాడు ప్రపంచవ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించుకున్నాడు. మైదానంలో ఆటతో అలరించే విరాట్‌కు రెస్టారెంట్ వ్యాపారం(Restaurant Business) ఉందనే విషయం తెలిసిందే. అయితే.. ముంబైలో కోహ్లీకి చెందిన ‘వన్ 8 కమ్యూనే'(One 8 Commune) రెస్టారెంట్‌కు వెళ్లిన ఓ అభిమానికి ఘోర అవమానం జరిగింది. ఈ విషయాన్ని సదరు ఫ్యాన్ సోషల్ మీడియా వీడియో ద్వారా అందరితో పంచుకున్నాడు.
తమిళనాడుకు చెందిన కోహ్లీ అభిమాని ముంబైలోని జూహూలో ఉన్న ‘వన్ 8 కమ్యూనే'(One 8 Commune) రెస్టారెంట్‌కు వెళ్లాడు. అయితే.. తెల్లని షర్ట్, తెల్లని ధోతీ ధరించిన అతడిని అక్కడి మేనేజ్మెంట్ డ్రెస్ కోడ్ సరిగ్గా లేదని లోపలికి అనుమతించలేదు. ‘నేను రామ్రాజ్ కాటన్‌కు చెందిన ‘వెస్థి’ అనే మంచి రకం ధరించి కోహ్లీ రెస్టారెంట్‌కు వెళ్లాను.
Person with Veshti was not allowed in @imVkohli ‘s Restaurant
Very nice da👌 pic.twitter.com/oTNGVqzaIz
— உன்னைப்போல் ஒருவன் (@Sandy_Offfl) December 2, 2023
నా డ్రెస్ రెస్టారెంట్ డ్రెస్‌కోడ్‌కు అనుగుణంగా లేదనే సాకుతో వాళ్లు నన్ను లోపలికి పంపలేదు. దాంతో, ఎంతో నిరాశతో నా హోటల్‌కు వెళ్లిపోయాను’ అని ఆ అభిమాని వీడియోలో తన ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సొంత గడ్డపై ఈ మధ్యే ముగిసిన వన్డే వరల్డ్ కప్‌లో విరాట్ కోహ్లీ దంచికొట్టాడు. ఈ మెగా టోర్నీలో రెండు శతకాలతో వన్డేల్లో 50 సెంచరీలు బాదిన తొలి క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు. మొత్తంగా 765 పరుగులు సాధించిన కోహ్లీ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు గెలిచాడు. వరల్డ్ కప్ ఫైనల్లో ఓటమితో కుంగిపోయిన కోహ్లీ ప్రస్తుతం కుటుంబంతో గడుతుపుతున్నాడు. భార్య అనుష్కా శర్మ, కూతురు వామికతో కలిసి లండన్‌లో విహరిస్తున్నాడు. ఈ స్టార్ బ్యాటర్ త్వరలోనే దక్షిణాఫ్రికా సిరీస్‌కు వెళ్లే జట్టుతో కలువనున్నాడు.