ఎజెనె(అమెరికా):కెన్యా దిగ్గజ అథ్లెట్ ఫెయిత్ కిపియెగాన్ ప్రపంచ రికార్డుతో సత్తాచాటింది. ఆదివారం ప్రిఫోంటైన్ క్లాసిక్ టోర్నీలో 1500మీటర్ల రేసును కిపియెగాన్ 3నిమిషాల 48.68సెకన్లలో పూర్తి చేసి కొత్త వరల్డ్ రికార్డును తన పేరిట లిఖించుకుంది. తన పేరిట ఉన్న గత రికార్డు(3:49:04సె)ను తిరుగరాస్తూ చరిత్ర లిఖించింది.
అభిమానుల హర్షధ్వానాల మధ్య రేసును ముగించిన కిపియెగాన్ కెన్యా జాతీయపతాకంతో సందడి చేసింది. గత మూడు ప్రపంచ చాంపియన్‌షిప్‌లలో 1500 మీటర్ల విభాగంలో విజేతగా నిలిచిన ఈ కెన్యా అథ్లెట్ పారిస్(2024) ఒలింపిక్స్‌లో రజతం సొంతం చేసుకుంది.